Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సమ్మర్‌లో మామిడి పండ్లు తింటే వేడి చేస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే

సమ్మర్‌లో మామిడి పండ్లు తింటే వేడి చేస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే

Times Now Telugu 3 weeks ago

మ్మర్ సీజన్‌లో మామిడి పండ్లను ఎంతో ఇష్టంగా తింటారు. ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి మామిడి పండ్లను తినడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మామిడి పండ్లు విషయంలో చాలా మందికి ఒక సందేహం ఉంటుంది.

మామిడి పండ్లను ఎక్కువగా తింటే వేడిమి చేస్తుందని చెబుతుంటారు. అయితే నిజంగానే మామిడి పండ్లు వేడి చేస్తాయా? నిపుణులు ఏమంటున్నారనే విషం తెలుసుకుందాం!

ఫలాల్లో రారాజుగా పిలిచే మామిడిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వేసవిలో మామిడి పండ్లు తినడం చాలా మందికి ఒక అలవాటుగా మారిపోయింది. ప్రతి ఏడాది మామిడి పండ్లు తినే సమయంలో చాలా మంది ఒక మాట చెబుతుంటారు. మామిడి పండ్లు ఎక్కువగా తింటే వేడిమి చేస్తుంది అంటారు.

మామిడి పండు తింటే నిజంగానే వేడి చేస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారు.
నిపుణుల ప్రకారం, పండ్లలో కేవలం పోషక విలువలు మాత్రమే ఉంటాయి. కూల్ లేదా హాట్ అనేవి పండ్లలో ఉండవు. మామిడి పండులో నేచురల్ షుగర్స్ ఉంటాయి. దీనితో పాటు మాంజిఫెరిన్ అనే పదార్థం ఉంటుంది. ఇవి జీర్ణక్రియ సమయంలో తేలికపాటి వెచ్చదనాన్ని కలిగిస్తాయి. అయితే ఇవి జ్వరం వలె శరీర ఉష్ణోగ్రతను పెంచవు, వేడి అనేది తేలికపాటిది,తాత్కాలికమైనదని చెబుతున్నారు.


ఎంత మోతాదులో తింటున్నారనేది చాలా ముఖ్యం
మామిడి పండ్ల విషయంలో వాటిని ఎంత మోతాదులో తీసుకుంటున్నారనేది చాలా ముఖ్యం. ఒక మామడి పండు తినడం లేదా రెండు,మూడు మామిడి పండ్లు ఒకేసారి తినడం మధ్య చాలా వ్యత్యాసం ఉందని చెబుతున్నారు. ఎక్కువ మోతాదులో తినడం వలన కడుపులో అసౌకర్యంగా అనిపిస్తుంది. ఫైబర్, ఫ్రక్టోజ్ మామిడి పండులో ఉంటాయి, కాబట్టి కడుపు ఉబ్బరం, డయోరియా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మామిడి పండ్లు ఎక్కువగా తినడం వలన కలిగే నష్టాలు ఇవే....
మామిడి పండ్లు ఎక్కువగా తినడం వలన కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. జీర్ణ సమస్యలు,రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి.

మామిడి పండ్లు తింటే వేడి అనిపిస్తుందా?
సమ్మర్ సీజన్‌లో మీ శరీరంలో డీహైడ్రేషన్, జీర్ణక్రియ నెమ్మదించడం వంటివి జరుగుతాయి. ఇలాంటి సమయంలో ఎక్కువ తియ్యగా ఉండే పండ్లు తినడం వలన కడుపు నిండుగా లేదా వేడిగా అనిపించవచ్చు. వివిధ కారణాల వలన వేడిగా అనిపించవచ్చు. అంటే మామిడి పండ్లు తింటే వేడి చేస్తుందని కాదు,సరైన విధానంలో తీసుకోవాలి. రోజులో మితంగా ఒకటి లేదా రెండు మామిడి పండ్లను తినాలి. పెరుగు వంటి లిక్విడ్ ఫుడ్స్‌తో పాటు ఈ పండ్లను తినేందుకు ప్రయత్నించాలి. ఖాళీ కడుపుతో తినడం వలన, జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మామిడి పండ్లను తినే ముందు కొంత సమయం నీళ్లలో నానబెట్టి తినాలి.

Disclaimer:
పైన తెలిపిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే....పాటించేముందు సంబంధిత నిపుణుల సలహా పాటించడం తప్పనిసరి!


Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu