దక్షిణ భారతదేశ రవాణా ముఖచిత్రాన్ని మార్చేసే సమయం ఆసన్నమైంది.ఈ పారిశ్రామిక కారిడార్ ప్రాంతాన్ని ఎకనామిక్ కారిడార్‌గా మార్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.
ఈ క్రమంలో బెంగళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్ (NH-544G) విషయంలో జాతీయ రహదారుల నిర్మాణం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.ఈ క్రమంలో రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ గుత్తేదారు సంస్థ నాలుగు గిన్నీస్ రికార్డులను సృష్టించింది. కేవలం ఒకే వారంలో ఏకంగా నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సొంతం చేసుకుని, రోడ్ల నిర్మాణంలో భారత్ వేగం ఏంటో ప్రపంచానికి చాటిచెప్పింది.
ఏపీ నుంచి కర్ణాటక మధ్య ఎకనామిక్ కారిడార్
ఐటీ రాజధాని బెంగళూరు నుంచి వాణిజ్య హబ్ విజయవాడకు వెళ్లాలంటే సుమారు 635 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ట్రాఫిక్, ఇరుకైన రహదారుల వల్ల ఈ ప్రయాణానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది. అయితే నిర్మాణంలో ఉన్న ఈ 518 కిలోమీటర్ల యాక్సెస్-కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయితే ఈ దూరం 535 కిలోమీటర్లకు తగ్గిపోతుంది.అంటే 100 కిలోమీటర్లు దూరం తగ్గడంతోపాటు ప్రయాణ సమయం 12 గంటల నుంచి కేవలం 8 గంటలకు తగ్గిపోనుంది. అయితే ఈ జాతీయ రహదారి కేవలం ఐటీ రాజధాని వాణిజ్య రాజధాని కలిపే రహదారి మాత్రమే కాదని ఆర్థిక వ్యవస్థను పరగులు పెట్టించే ఎకనామిక్ కారిడార్‌గా రూపుదిద్దుకోబోతుంది అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. 
పుట్టపర్తి వేదికగా నాలుగు గిన్నీస్ రికార్డులు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఎకనామిక్ కారిడార్ రహదారి పనులను ఈ ఏడాది జనవరి 2026లో ప్రారంభించింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకన్ సంస్థతో కలిసి పుట్టపర్తి మండలం సాతర్లపల్లి వద్ద రహదారి నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. జనవరి 6న బొంతలపల్లి సమీపంలో 28.89 లేన్ కిలోమీటర్ల పొడవైన రహదారిని 24 గంటల్లో పూర్తి చేసి గిన్నీస్ రికార్డు సృష్టించింది. అలాగే 24 గంటల వ్యవధిలో 9.63 కిలోమీటర్ల మేర 3-లేన్ల రహదారిని నిరంతరాయంగా నిర్మించి రికార్డు సృష్టించారు. అదే సమయంలో 10,655 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్‌ను వాడారు. అంటే సుమారు 1,400 ఏనుగుల బరువున్న మెటీరియల్‌ను ఒక్క రోజులోనే రోడ్డుగా మార్చేసి గిన్నీస్ రికార్డు సృష్టించారు.మరోవైపు జనవరి 11న మరో రెండు రికార్డులను ఎన్‌హెచ్ఏఐ, రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ గుత్తేదారు సంస్థలు బద్దలు కొట్టాయి. 57,500 మెట్రిక్ టన్నుల మెటీరియల్‌ను నిరంతరాయంగా వాడి 156 లేన్ కిలోమీటర్ల (సుమారు 52 కి.మీ పొడవు) రోడ్డును నిర్మించారు. అంటే ఇప్పటి వరకు 84.4 లేన్ కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరిగింది. ఇదే ప్రపంచ రికార్డుగా ఉంది. అయితే ప్రపంచ రికార్డును భారత్ తుడిచిపెట్టేసింది. ఏకంగా 156 లేన్ కిలోమీటర్ల రోడ్డును పూర్తి చేసింది. ఈ రహదారి నిర్మాణంలో 600 మందికి పైగా ఇంజనీర్లు,వందలాది మంది కార్మికులు 70 టిప్పర్లు, 17 రోలర్లు రేయింబవళ్లు శ్రమించాయి. ఈ పనుల్లో ఎలాంటి నాణ్యత లోపించకుండా ఉండేందుకు ఐఐటీ బాంబే సంస్థ పర్యవేక్షించాయి.
మారిపోతున్న రాయలసీమ రూపు రేఖలు
ఈ జాతీయ రహదారి కేవలం విజయవాడ-బెంగళూరు ఎకనామిక్ కారిడార్ నిర్మాణం వల్ల రాయలసీమ వాసుల తలరాతలు సైతం మారిపోనున్నాయి. రాయలసీమ ప్రాంతంలోని కడప, కర్నూలు జిల్లాల తలరాతను ఈ జాతీయ రహదారి మార్చబోతుంది. ఎందుకంటే ఈ జాతీయ రహదారి విజయవాడ నుంచి కడప, కర్నూలుల మీదుగా బెంగళూరు వెళ్లబోతుంది. ఈ జాతీయ రహదారి నిర్మాణం వల్ల రైతుల వ్యవసాయ ఉత్పత్తులు,ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల రవాణాకు ఈ హైవే ఒక వరంగా మారనుంది.అంతేకాదు బెంగళూరులోని టెక్ కంపెనీలకు,ఏపీలోని ఓడరేవులకు మధ్య ఇది ఒక బలమైన వారధిలా నిలవనుంది. ఐటీ రంగానికి అవసరమైన లాజిస్టిక్స్ సపోర్ట్ ఈ కారిడార్ ద్వారా వేగంగా అందే అవకాశం ఉంది. 
ప్రధాని మోడీ దార్శనికత్వంలో విజయాలు
ఇకపోతే 343 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేలో 17 ఇంటర్‌చేంజ్‌లు, 5.3 కిలోమీటర్ల పొడవైన టన్నెల్,21 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం, 10కి పైగా విశ్రాంతి గదులు, రెస్టారెంట్లు ఉండన్నాయి. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ఈ రికార్డు సర్టిఫికేట్లను అందుకున్నారు. ఇది కేవలం వేగంగా కట్టిన రోడ్డు మాత్రమే కాదని... భారత్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చెప్పడానికి ఈ రహదారి నిర్మాణం ఒక ఉదాహరణ అని నేతలు అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ దార్శనికత్వంలో సాధించిన ఈ విజయాలు ప్రపంచ స్థాయి హైవే మౌళిక వసుతల కల్పన, భారీ ప్రాజక్టుల అమలులో మన సత్తాను చాటి చెప్పాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.ఇప్పటికే ఈ హైవే నిర్మాణ ప్రక్రియలో భాగంగా నాలుగు గిన్నీస్ రికార్డులు నెలకొంది.ఇదే స్ఫూర్తితో కారిడార్ మిగిలిన పనులు పూర్తి చేయాలని సీఎ చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.
Read more news like this on telugu.timesnownews.com

