Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Silver Rate Today: భారీగా తగ్గిన వెండి ధర...మే 30వ తేదీ, శనివారం సిల్వర్ ధరలు ఇవే..

Silver Rate Today: భారీగా తగ్గిన వెండి ధర...మే 30వ తేదీ, శనివారం సిల్వర్ ధరలు ఇవే..

Times Now Telugu 2 weeks ago

నేడు మే 30వ తేదీ, శనివారం సిల్వర్ ధరలు భారీగా తగ్గాయి. ఒక కేజీ వెండి ధర ప్రస్తుతం రూ. 2,57,134 పలుకుతోంది. సిల్వర్ ధరలు తగ్గడానికి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పరిస్థితులే కారణమని చెప్పవచ్చు.

నేడు బంగారంతో పోటీగా సిల్వర్ కూడా ధర తగ్గుతోంది. ఎందుకంటే ఇన్వెస్టర్లు గతంలో బంగారంపై సురక్షితమైన పెట్టుబడిగా భావించి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. అదే సమయంలో వెండిపై కూడా ఇన్వెస్టర్లు ఎక్కువగా బులిష్‌గా ఉన్న నేపథ్యంలో భారీగా పెట్టుబడులు పెట్టారు.

ప్రస్తుతం ఈ పెట్టుబడులపై ప్రాఫిట్ బుకింగ్ చూడవచ్చు. అందుకే వెండి ధరలు తగ్గుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. వెండి ధర గడచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే దాదాపు 200 శాతం వరకు పెరిగినట్లు చూడవచ్చు. ఈ ఏడాది ప్రారంభం నుంచి గమనించినట్లయితే ఒక కేజీ సిల్వర్ ధర అనూహ్యంగా 4.25 లక్షల రూపాయల వద్దకు వెళ్లి ఆల్ టైం రికార్డును స్థాపించింది. కానీ వెంటనే 40 శాతం విలువ కోల్పోయి ప్రస్తుతం రూ. 2.5 నుంచి రూ. 2.6 లక్షల మధ్యలో ట్రేడ్ అవుతోంది. సిల్వర్ ధర మార్కెట్లో భారీగా తగ్గుతున్న నేపథ్యంలో అందులో పెట్టుబడులు పెట్టే వారిలో ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది.

అయితే ప్రస్తుతం వెండిలో వచ్చినటువంటిది ఒక షార్ట్ కరెక్షన్ మాత్రమే అని నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి సిల్వర్‌లో ఇండస్ట్రియల్ డిమాండ్ ఉన్న నేపథ్యంలోనే ధరలు భారీగా పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. బంగారంతో సంబంధం లేకుండానే నిజానికి వెండికి అనూహ్యంగా పారిశ్రామిక డిమాండ్ రావడం వల్లనే ఈ ధరలు పలికినట్లు నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోనూ, అలాగే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలోనూ, దీంతో పాటు సోలార్ ప్యానల్స్ తయారీలో కూడా వెండి వాడకం ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇన్వెస్టర్లు దీర్ఘకాలికంగా వెండిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సిల్వర్ ధరలు భారీగా పెరిగి ప్రస్తుతం తగ్గుతున్నాయి.

అయితే సిల్వర్‌లో పెట్టుబడి పెట్టేవారు మాత్రం తప్పనిసరిగా సిల్వర్ ఈటీఎఫ్ లేదా డిజిటల్ రూపంలో ఉన్నటువంటి పెట్టుబడుల వైపు అడుగులు వేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఫిజికల్ రూపంలో సిల్వర్‌ను కొనుగోలు చేసినా కానీ అదే స్థాయిలో రాబడి పొందడం అనేది చాలా కష్టం. అదే సమయంలో సిల్వర్ ఈటీఎఫ్ వంటివి షేర్ మార్కెట్ తరహాలోనే సిల్వర్ నుంచి లాభాలను పొందడానికి చాలా వీలుగా ఉంటుంది.

Disclaimer: పై కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడింది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా పరిగణించరాదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు అన్ని పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోనవుతాయి. మీరు చేసే వ్యాపారాలు లేదా పెట్టుబడుల వల్ల కలిగే లాభనష్టాలకు టైమ్స్ నౌ తెలుగు ఎలాంటి బాధ్యత వహించదు. పెట్టుబడి లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు, మీ సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని టైమ్స్ నౌ తెలుగు పాఠకులకు సూచిస్తోంది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu