Dailyhunt
Silver Rate Today: స్వల్ప ధరలకే లభిస్తున్న వెండి... మే 1వ తేదీ శుక్రవారం వెండి ధరలు ఇవే..

Silver Rate Today: స్వల్ప ధరలకే లభిస్తున్న వెండి... మే 1వ తేదీ శుక్రవారం వెండి ధరలు ఇవే..

Times Now Telugu 2 weeks ago

మే ఒకటో తేదీ శుక్రవారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఒక కేజీ వెండి ధర 244,790 రూపాయలు పలుకుతోంది. నిన్నటితో పోల్చి చూస్తే వెండి ధర నేడు కాస్త పెరిగినట్లు చూడవచ్చు.

అయితే ఇప్పటికి కూడా వెండి ధర తక్కువ ధరకే ట్రేడ్ అవుతోంది. సాధారణంగా యుద్ధ సమయాల్లో విలువైన లోహాల ధరలు భారీగా పెరుగుతుంటాయి. అయితే, గల్ఫ్ దేశాల్లో ప్రస్తుతం ఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ బంగారం , వెండి ధరల్లో మాత్రం తగ్గుదల నమోదైంది. కేవలం కొద్ది రోజుల్లోనే వాటి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. రూపాయి విలువ క్షీణించడం, US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడం, ముడి చమురు ధరలు భారీగా పెరగడం వంటి కారణాల వల్ల బంగారం, వెండి ధరలపై ఒత్తిడి పెరిగిందని, ఫలితంగానే ఈ ధరల పతనం సంభవించిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. నేడు మే నెల ఆరంభంలోనే, బంగారం, వెండి ధరల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది.

నిజానికి వెండి ధర ఆల్ టైం రికార్డ్ తో పోల్చి చూస్తే తక్కువగా ట్రేడ్ అవుతున్నట్లు చెప్పవచ్చు. ఎందుకంటే జనవరి 28వ తేదీన వెండి ధర 4.25 లక్షల రూపాయల టైం రికార్డును నమోదు చేసింది. అక్కడి నుంచి సిల్వర్ ధరలో దాదాపు 40 శాతం వరకు తగ్గినట్లు చెప్పవచ్చు. సిల్వర్ ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రస్తుతం సిల్వర్ లో పెట్టుబడి పెట్టే వారికి మాత్రం కాస్త ఆందోళనకరంగా ఉంది అని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా నెలకొని ఉన్న సిల్వర్ డిమాండ్ కారణంగా ధరలు భవిష్యత్తులో కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ డిమాండ్ కారణంగా సోలార్ ప్యానల్స్ తయారీలోనూ అలాగే ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కూడా వెండి వాడకం అనేది భారీగా పెరిగింది. ఈ కారణంగానే సిల్వర్ ధరలు భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశం ఉందని కూడా అంచనాలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న తర్వాత సిల్వర్ పెట్టుబడి పెట్టేవారు తమ పోర్ట్ ఫోలియోలో కొంతమొత్తం సిల్వర్ సైతం యాడ్ చేసుకుంటే భవిష్యత్తులో చక్కటి లాభాలను సైతం పొందే వీలుందని రాబర్ట్ కియోసాకి వంటి ప్రముఖ నిపుణులు పేర్కొంటున్నారు.

Disclaimer: పై కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడింది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా పరిగణించరాదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు అన్ని పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోనవుతాయి. మీరు చేసే వ్యాపారాలు లేదా పెట్టుబడుల వల్ల కలిగే లాభనష్టాలకు టైమ్స్ నౌ తెలుగు ఎలాంటి బాధ్యత వహించదు. పెట్టుబడి లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు, మీ సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని టైమ్స్ నౌ తెలుగు పాఠకులకు సూచిస్తోంది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu