Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సౌదీలో కేరళ వాసికి ఉరి శిక్ష: రూ.34 కోట్ల క్షమాధనం చెల్లించిన మలయాళీలు... అబ్దుల్ రహీమ్ చేసిన నేరమేంటో తెలుసా?

సౌదీలో కేరళ వాసికి ఉరి శిక్ష: రూ.34 కోట్ల క్షమాధనం చెల్లించిన మలయాళీలు... అబ్దుల్ రహీమ్ చేసిన నేరమేంటో తెలుసా?

Times Now Telugu 1 week ago

భారత దేశంలో చాలా మంది గల్ఫ్ కంట్రీకి వెళ్లి అక్కడ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటారు అన్న సంగతి తెలిసిందే.సౌదీ అరేబియా, కువైట్, అబుదాబి, పుజారా, ఇతర గల్ఫ్ కంట్రీలకు వలస వెళ్లి అక్కడ సంపాదించిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించుకుంటారు.

ఇలానే 20 ఏళ్ల క్రితం కేరళకు చెందిన ఓ వ్యక్తి సౌదీ అరేబియాకు వెళ్లాడు. అయితే అక్కడ ఓ బాలుడికి కేర్ టేకర్‌గా చేరారు. అయితే ఆ బాలుడు అకస్మాత్తుగా మరణించడంతో అక్కడి న్యాయస్థానం అతడికి ఉరిశిక్ష విధించింది. దీంతో లబోదిబోమన్నాడు. తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కేరళకు చెందిన మలయాళీలు అంతా ఏకమై స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఏకంగా రూ.34 కోట్లు వసూలు చేసి అతడికి ఇచ్చారు. దీంతో అతగాడు రూ.34 కోట్లు క్షమాధనంగా చెల్లించి సొంత రాష్ట్రమైన కేరళకు చేరుకున్నాడు.

సౌదీలో మలయాళీకి ఉరిశిక్ష
20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం సౌదీ అరేబియా వెళ్లిన కేరళకు చెందిన వ్యక్తి అనుకోని చిక్కుల్లో పడ్డాడు. తాను కేర్‌టేకర్‌గా పనిచేస్తున్న బాలుడు మరణానికి కారణం అయ్యాడంటూ అక్కడి న్యాయస్థానం అతడికి మరణ శిక్ష విధించింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఆయనకు సహాయం చేయడంతో సుమారు రూ.34 కోట్ల మొత్తాన్ని క్షమాధనంగా చెల్లించి కేరళలోని స్వగ్రామానికి చేరుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే కేరళలోని కోజీకోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్ 2006లో సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ ఒక దివ్యాంగ బాలుడికి కేర్‌టేకర్‌గా చేరాడు. అయితే ప్రమాదవశాత్తూ ఆ బాలుడు మృతి చెందడంతో రహీమ్‌పై బాలుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రహీమ్‌ను అరెస్ట్ చేశారు. అయితే అబ్ధుల్ రహీమ్‌కు క్షమాభిక్ష పెట్టేందుకు బాలుడి కుటుంబం నిరాకరించింది. దీంతో 2018లో కోర్టు అతనికి మరణశిక్షను విధించింది.

రూ.34 కోట్లు క్షమాధనం చెల్లించిన మలయాళీలు
అబ్దుల్ రహీమ్‌ మరణ శిక్ష నుంచి బయటపడగలగాలి అంటే ఆ దేశ చట్టాల ప్రకారం భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది.అబ్దుల్ రహీమ్‌ను ఉరిశిక్ష నుంచి కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఒక్కటయ్యారు. విరాళాల రూపంలో 15 మిలియన్ల సౌదీ రియాల్స్ అంటే రూ.34 కోట్లు క్షమాధనంగా సౌదీ కోర్టుకు చెల్లించారు.దీంతో సౌదీ కోర్టు అతనిని విడుదల చేసింది. అబ్దుల్ రహీమ్ బుధవారం రాత్రి సౌదీ నుంచి కేరళ చేరుకున్నాడు. గురువారం కరిపూర్ విమానాశ్రయంలో దిగి తన స్వగ్రామానికి వెళ్లాడు. 2018 నుంచి సౌదీ అరేబియా జైలులో మగ్గుతున్న అబ్దుల్ రహీమ్‌ను తిరిగి చూస్తామని అనుకోలేదని కుటుంబ సభ్యులు వాపోయారు. ఈ సందర్భంగా అబ్ధుల్ రహీమ్‌ను చూసి అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులు భావోద్వేగానికి గురయ్యారు.

అబ్ధుల్ రహీంను చూసి కన్నీటి పర్యంతమైన తల్లి

ఈ సందర్భంగా అబ్దుల్ రహీమ్ తన విడుదల కోసం సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు.తన తల్లిని మళ్లీ కలుసుకున్నానంటే ఇందుకు తనకు సహకరించిన వారే కారణమని చెప్పుకొచ్చాడు.తమ సంతోషం రెట్టింపయిందని రహీమ్ బంధువులు, స్నేహితులు పేర్కొన్నారు. ఇకపోతే ఇంటికి చేరుకున్నఅబ్ధుల్ రహీమ్‌ను చూసిన తల్లి ఒక్కసారిగా అతడిని హత్తకుని ఏడ్చింది. ఈ దృశ్యం అందర్నీ కదిలించింది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu