శ్రీలీలే టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసి హిందీ తమిళ చిత్రాలపైనే ఫుల్ ఫోకస్ పెట్టేసిందా? పరిస్థితి చూస్తే అలానే ఉందంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఎందుకంటే ఒకపక్క తమిళంలో ధనుష్ సరసన ఒక చిత్రాన్ని చేస్తున్న శ్రీలీల హిందీలో కార్తీక్ ఆర్యన్ చిత్రం లో ఒక రొమాంటిక్ మూవీ లో నటిస్తుంది.
ఇక ఆ చిత్రంలో నటిస్తూనే సైలెంట్ గా సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ సరసన హీరోయిన్ గా మరో హిందీ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. దిలేర్ అనే పేరుతో మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మాణంలో కునాల్ దేశముఖ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కింది. ఇక ప్రస్తుతం అటు హిందీ ఇటు తమిళంపై ఫుల్ ఫోకస్ పెట్టిన శ్రీలీల తెలుగులో మాత్రం ఎటువంటి కొత్త సినిమాలు కమిట్ అవ్వటం లేదు. దీనికి కారణం?
నిజానికి 2021 లో వచ్చిన ధమాకా సినిమా తరువాత శ్రీలీల కెరీర్ లో ఒక చెప్పుకోదగ్గ హిట్టు లేదు. భగవంత్ కేసరి హిట్టయినా అందులో శ్రీలీల హీరోయిన్ కాదు. మహేష్ గుంటూరు కారం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక ఆ తరువాత ఒక్క హిట్టు లేదు శ్రీలీలకు. ఎన్నో ఆశలు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది. అయితే ఒక పక్క తెలుగు లో అవకాశాలు తగ్గుతున్న సమయంలో తెలివిగా ఇటు తమిళం, అటు హిందీ మీద దృష్టి పెట్టింది శ్రీలీల. తమిళంలో ఆమె శివ కార్తికేయన్ చేసిన తొలి చిత్రం 'పరాశక్తి' హిట్టివ్వకపోయిన డాన్సింగ్ స్టార్ గా తెలుగు లో ఉన్న ఇమేజ్ కు బిన్నంగా ఆమెకు ఎంతో కొంత నటిగా పేరు తీసుకొచ్చింది. అదే ధనుష్ సరసన మరో ఛాన్స్ తెచ్చిపెట్టింది.
ఇక హిందీలో రెండు సినిమాలు చేస్తుంది శ్రీలీల. ఇందులో కార్తీక్ ఆర్యన్ తో చేస్తున్న మూవీ ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక 'దిలేర్' డేట్ ఇంకా ఫిక్స్ కానప్పటికీ అది కూడా ఈ ఏడాదే వచ్చే అవకాశాలున్నాయి. ఇక తమిళం లో ధనుష్ సరసన చేస్తున్న చిత్రం D55 కూడా ఈ ఏడాది చివర్లో కానీ, 2027 ప్రారంభంలో కానీ విడుదల కానున్నట్లు సమాచారం. అయితే ధనుష్ చిత్రంలో సాయి పల్లవి కూడా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. సో ఈ మూడు చిత్రాలు ఇప్పుడు శ్రీలీల కెరీర్ ను డిసైడ్ చేయనున్నాయి. ఒక వేళ హిందీలో ఆమె చేసిన రెండు చిత్రాలు హిట్లు కొడితే మాత్రం బాలీవుడ్ లో ఆమెను బిజీ స్టార్ ను చేసే అవకాశముంది. మరోపక్క తమిళంలో ధనుష్ చిత్రం హిట్టయితే అక్కడ మరిన్ని అవకాశాలు రావొచ్చు. ఈ లెక్కన చూస్తే టాలీవుడ్ కు తాత్కాలికంగా ఈమె దూరంగానే ఉన్నట్టే కన్పిస్తుంది.
అయితే ఈమె తెలుగు లో కొత్త సినిమాలు కమిట్ అవ్వకపోవడానికి కారణం హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా రెమ్యూనరేషన్ విషయంలో ఆమె తగ్గకపోవడమే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజమెంతో తెలియదు కానీ, తెలుగులో ఆమె కొత్త సినిమాలైతే ఏమీ కమిట్ కాకపోవడం ఈ పుకార్లకు బలం చేకూరుస్తుంది. మరి నిజంగానే శ్రీలీల టాలీవుడ్ కు బై చెప్పెయ్యబోతుందా? లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Read more news like this on telugu.timesnownews.com

