టాటా మోటార్స్ తమ అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ టాటా టియాగోకు కొత్త ఫేస్‌లిఫ్ట్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. ఈ మోడల్ మే 28, 2026న భారతీయ మార్కెట్‌లో విడుదల కానుంది.
టియాగో ఇప్పటికే బడ్జెట్ పరంగా వినియోగదారులలో విశేష ఆదరణ పొందిన వాహనం. ఇప్పుడు కొత్త డిజైన్ TO ఇది మరింత ఆకర్షణీయంగా ఉండనుంది . టాటా మోటార్స్ ఈ ఫేస్‌లిఫ్ట్ ద్వారా వినియోగదారుల అంచనాలను అందించడమే కాకుండా మార్కెట్లో గట్టి పోటీని ఇచ్చే విధంగా తీసుకువస్తుంది . టియాగో ఫేస్‌లిఫ్ట్ విడుదల కంపెనీకి మరో ముఖ్యమైన మైలురాయిగా నిలువనుంది . ధర ప్రస్తుతం ఉన్న మోడల్ కంటే కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ వినియోగదారులకు మంచి ఎంపిక గా నిలిచే అవకాశం ఉంది. ఈ కొత్త టియాగో ఫేస్‌లిఫ్ట్ వినియోగదారుల విశ్వాసాన్ని పెంచే ఎంపికగా మారనుంది.
టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ 2026
టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ మోడల్ లో ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు .1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తోనే కొనసాగనుంది. ట్రాన్స్‌మిషన్ లు కూడా మాన్యువల్ , ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. టాటా టియాగోలో CNG ఆప్షన్ కూడా అందించే అవకాశం ఉంది.
డిజైన్
టాటా టియాగోను రిఫ్రెష్‌తో తీసుకువస్తుంది . ఈ హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు మంచి లుక్ లో కనిపిస్తోంది. ఇది బ్రాండ్ లేటెస్ట్ డిజైన్ తో ప్రీమియమ్ మంచి రోడ్ ప్రెజెన్స్‌ను పొందింది. ఈ కొత్త టియాగో ముందుభాగంలో మార్పులు ఎక్కువగా ఉన్నాయి . హెడ్‌ల్యాంప్స్ సన్నగా ఉంటూ ఫుల్-LED యూనిట్స్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ LED డే టైమ్ రన్నింగ్ లైట్స్‌ను కలిగి ఉన్నాయి. గ్రిల్ ,బంపర్‌లో కూడా మార్పులు చేసారు . ముఖ్యంగా దిగువ భాగంలో బ్లాక్ గ్రిల్ఇచ్చారు. బంపర్ ఇరువైపులా కాంపాక్ట్ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి .
కొత్త టాటా టియాగో కు స్పోర్టీ లుక్ ఇవ్వడానికి కాంట్రాస్ట్ బ్లాక్ రూఫ్, బ్లాక్ ORVMలు, షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి వాటిని జత చేసారు . కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఆల్ట్రోజ్‌లో లభించే బ్రైట్ ఎరుపు రంగు కూడా ఈ టియాగో అప్‌డేటెడ్ లో అందించారు .
వెనుక భాగంలో కూడా మార్పులు చేసారు . టెయిల్‌ల్యాంప్స్ కనెక్టెడ్ లైట్ లైన్ కనిపించేలా డిజైన్ చేసారు . రియర్ బంపర్ , టెయిల్‌గేట్ డిజైన్‌లో హారిజాంటల్ ,వెర్టికల్ స్టైలింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి.
ఫీచర్స్
కొత్తగా డాష్‌బోర్డ్‌ను డిజైన్ చేశారు. స్టీరింగ్ వీల్‌పై వెలిగే లోగోను అందించారు . కార్ లోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా అప్‌డేట్ చేసారు . కొత్త 10.25- ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందించారు.మొత్తం ఫీచర్లను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ హెడ్‌లైట్స్, క్రూయిజ్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ఫీచర్స్ ఉండే అవకాశం ఉంది.
ధర
కొత్త టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ 2026 ఎక్స్ షో రూమ్ ధరలు Rs 4.60 లక్షల నుండి to Rs 7.70 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది
Read more news like this on telugu.timesnownews.com

