Dailyhunt
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ ప్రభంజనం... విజయ్ ఇంటికి వెళ్లిన హీరోయిన్ త్రిష

తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ ప్రభంజనం... విజయ్ ఇంటికి వెళ్లిన హీరోయిన్ త్రిష

Times Now Telugu 1 week ago

మిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. మెుదటి రౌండ్ నుంచి టీవీకే పార్టీ ఆధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఫలితాలను పరిశీలిస్తే టీవీకే అధినేత, హీరో విజయ్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయంగా తెలుస్తోంది.

ఎవరూ ఊహించని రీతిలో ఏ ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలకు దొరకని విధంగా టీవీకే పార్టీ దూసుకుపోతుంది.దీంతో తమిళనాడులో టీవీకే పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంబరాలుచేసుకుంటున్నారు. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మరోవైపు విజయ్ ఫ్యామిలీ సైతం ఫుల్‌జోష్‌లో ఉంది. ఇలాంటి తరుణంలో త్రిష కృష్ణన్ విజయ్ ఇంటికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న త్రిష అనంతరం విజయ్ నివాసానికి చేరుకోవడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

విజయ్ ఇంటికి త్రిష

తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయటం లాంఛనంగానే కనిపిస్తోంది. టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతోపాటు.. మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో ఉంది. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న వేళ హీరో త్రిష కృష్ణన్ ప్రస్తావన తెరమీదకు రావడం సంచలనంగా మారింది.మే 4 త్రిష బర్త్ డే. తన జన్మదినం సందర్భంగా త్రిష సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. తన 44వ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఆదివారం రాత్రి త్రిష తిరుమల చేరుకున్నారు. సోమవారం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం నేరుగా టీవీకే అధినేత, హీరో విజయ్ నివాసానికి చేరుకున్నారు.

తమిళనాడులో టీవీకే ప్రభంజనం
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ప్రభంజనం సృష్టిస్తున్న సందర్భంగా త్రిష వారి ఇంటికి వెళ్లడం సంచలనంగా మారింది. ఇప్పటికే విజయ్ త్రిషల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఓ బీజేపీ నాయకుడు కూడా ఇలానే విమర్శలు గుప్పించారు. మరోవైపు పరోక్షంగా విజయ్ సతీమణి సైతం ఆరోపణలు చేశారు. అంతేకాదు విజయ్ సతీమణి విడాకులు కోరుతూ కోర్టును సైతం ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో విజయ్ ఇంటికి త్రిషవెళ్లడం చర్చకు దారి తీసింది. అయితే విజయ్ పార్టీ తమిళనాడు అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేసేందుకే వెళ్లింది అనే ప్రచారం జరుగుతుంది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu