Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tata Tiago: టాటా కొత్త టియాగో వచ్చేసింది.... ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే

Tata Tiago: టాటా కొత్త టియాగో వచ్చేసింది.... ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే

Times Now Telugu 1 week ago

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్, కొత్త టియాగో, టియాగో ఈవీని మార్కెట్లోకి లాంఛ్ చేసింది. టాటా టియాగో 2026 మోడల్‌ను ఇండియాలో ఎంట్రీలెవల్ ధర రూ.4.69 లక్షలు ( ఎక్స్-షోరూమ్ ) ధరకు అందుబాటులోకి తెచ్చింది.

కొత్త టియాగోలో పలు కీలక మార్పులును తీసుకు వచ్చారు. ఇతర కారు మోడల్స్‌కు పోటీగా దీనిలో పలు మార్పులు చేశారు.

ఇంటీరియర్ ఫీచర్స్...
టాటా టియాగో 2026 మోడల్‌లో 2 స్పోక్ స్టీరింగ్ వీల్ ఇచ్చారు. దీనితో పాటు 10.25 అంగుళాల టచ్ స్క్రీన్, డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జర్, 360 డిగ్రీల కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, రియర్ ఏసీ వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటో హెడ్ ల్యాంప్ వంటి ఇంటీరియర్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
టాటా టియాగో ఫేస్ లిఫ్ట్ 2026 మోడల్ మరింత సేఫ్టీ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ ఉన్నాయి, దీనితో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టాటా మోటార్స్ టియాగో మోడల్‌తో పాటు టియాగో సీఎన్‌జీ, టియాగో ఈవీ మోడల్‌ను లాంఛ్ చేసింది. టాటా టియాగో పెట్రోల్ వెర్షన్ ధర రూ. 4.69 లక్షలు నుండి , సీఎన్‌జీ వెర్షన్ ధర రూ. 5.79 లక్షల నుండి ప్రారంభమవుతుంది.( ఎక్స్ షోరూమ్ ధరలు)

ఈ రెండు మోడల్స్ పూర్తిగా న్యూ లుక్‌తో, రీడిజైన్ చేయబడిన క్యాబిన్‌, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్‌ను , కేవలం టాప్ ట్రిమ్స్‌లోనే కాకుండా ప్రతి వేరియంట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తుంది. ఈ కారులో మొత్తం ఆరు వేరియంట్లు ఉన్నాయి: స్మార్ట్, ప్యూర్, ప్యూర్+, ప్యూర్+ ఎ, క్రియేటివ్ , క్రియేటివ్+.

టియాగో పెట్రోల్ వేరియంట్‌లో 1.2 లీటర్ నేచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 86 హెచ్‌పీ పవర్, 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టియాగో సీఎన్‌జీ వేరియంట్‌లోనూ 1.2 లీటర్ ఇంజిన్‌ను అమర్చారు. 74 హెచ్‌పీ పవర్‌ను, 96 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టియాగో 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ AMT ఆప్షన్లలో లభిస్తాయి.

టియాగో ఈవీ విషయానికి వస్తే ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. 19.2 kwh బ్యాటరీ కెపాసిటీ కలిగిన కారు సింగిల్‌ ఛార్జింగ్‌తో 205 కిలోమీటర్లు, 24 kwh బ్యాటరీ వేరియంట్‌తో 15 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu