Dailyhunt
థార్ ఎడారిలో రికార్డ్ స్థాయిలో చమురు ఉత్పత్తి, ఎన్ని బ్యారెల్స్ పెరిగింది తెలుసా?

థార్ ఎడారిలో రికార్డ్ స్థాయిలో చమురు ఉత్పత్తి, ఎన్ని బ్యారెల్స్ పెరిగింది తెలుసా?

Times Now Telugu 1 week ago

మెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో చమురు మార్కెట్లలో అస్థిరత ఏర్పడింది.

ఇటీవల ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో చమురు ఉత్పత్తిని భారీగా పెంచింది.

జోధ్‌పూర్ ఇసుకరాతి పొర నుండి ఈ సంస్థ చరిత్రలోనే అత్యధికంగా చమురు ఉత్పత్తిని నమోదు చేసింది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ చమురు ఉత్పత్తిని రోజుకు 1,202 బ్యారెళ్లకు పెంచింది. గతేడాదిలో ఉత్పత్తి చేసిన రోజుకు 705 బ్యారెళ్లతో పోలిస్తే ఇది దాదాపు 70 శాతం ఎక్కువ. రాజస్థాన్, జైసల్మేర్‌లోని బఘేవాలా ఫీల్డ్ నుండి వెలికితీసిన ముడి చమురును ట్యాంకర్ల ద్వారా గుజరాత్‌లోని మెహసానాలో ఉన్న ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC)కు రవాణా చేస్తారు. అక్కడి నుండి, స్ట్రీమ్‌లైన్ సప్లై చైన్‌తో దానిని పైప్‌లైన్‌ల ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నిర్వహిస్తున్న కోయాలి రిఫైనరీకి పంపిస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో, చమురు ఉత్పత్తి గత సంవత్సరంలోని 32,787 మెట్రిక్ టన్నుల నుండి 43,773 మెట్రిక్ టన్నులకు పెరిగింది. చమురు ఉత్పత్తిలో కంపెనీ స్థిరమైన ఉత్పత్తిని కనబర్చింది.

అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో పెరుగుతున్న వృద్ది
ఆయిల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ చమురు ఉత్పత్తిలో పెరుగుదలకు ప్రధాన కారణం, ఆధునిక వెలికితీత పద్ధతులను పాటించడమేనని చెబుతున్నారు . ఆయిల్ ఇండియా కంపెనీ, రాజస్థాన్‌లోని ఈ ప్రాంతంలో లభించే అధిక స్నిగ్ధత గల ముడి చమురును వెలికితీసేందుకు ప్రత్యేకంగా ప్రభావవంతమైన, ఉష్ణంతో మెరుగుపరచబడిన చమురు వెలికితీత పద్ధతి అయిన సైక్లిక్ స్టీమ్ స్టిమ్యులేషన్ (CSS)ను ఎక్కువగా ఉపయోగించింది.

"ముఖ్యంగా థార్ ఎడారి ప్రాంతంలోని సవాలుతో కూడిన భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకన్నట్లయితే ఇది ఎంతో గొప్ప విజయం. భారతదేశ ఇంధన అవసరాలకు దోహదపడటంలో అసాంప్రదాయ వనరుల సామర్థ్యాన్ని ఇది తెలియజేస్తుంది," అని ఒక అధికారి తెలిపారు. చమురు ఉత్పత్తి కోసం ఈ కంపెనీ మొత్తం 19 బావుల్లో CSS ఆపరేషన్స్ చేపట్టింది. వీటి నుండి గత ఏడాది కంటే 72 శాతం అధికంగా చమురును ఉత్పత్తి చేసింది. దీనితో పాటు గతంలో 9 ఉండగా, 13 కొత్త బావులను తవ్వింది. చమురు ఉత్పత్తి పెరుగుదలలో ఈ ప్రయత్నాలు కీలక పాత్ర పోషించాయి.

బికానెర్-నాగౌర్ సబ్-బేసిన్‌లో ఉన్న బఘేవాలా చమురు క్షేత్రం, భారతదేశంలోని కొన్ని భూభాగపు భారీ చమురు నిల్వలలో ఒకటి. ఇక్కడ నుండి ముడి చమురును వెలికితీయడం చాలా కష్టంతో కూడిన పని, అధిక స్నిగ్ధత కారణంగా చమురును వెలికితీయడం చాలా క్లిష్టంగా ఉంటుంది. దీని వల్ల సాధారణ పద్దతుల్లో చమురును వెలికితీయడం కష్టంగా ఉంటుంది.

బఘేవాలా చమురు క్షేత్రం ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆయిల్ ఇండియా కంపెనీ ఫిష్‌బోన్ డ్రిల్లింగ్, బేర్‌ఫుట్ కంప్లీషన్, ఎలక్ట్రిక్ డౌన్‌హోల్ హీటర్లు , హైడ్రాలిక్ సక్కర్ రాడ్ పంపుల వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తుంది. దీనితో పాటు చమురు వెలికితీత సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి డైల్యూయెంట్ ఇంజెక్షన్ , ఆర్టిఫిషియల్ లిఫ్ట్ సిస్టమ్స్ వంటి పద్ధతులను ఇక్కడ ఉపయోగించారు. 1991లోనే కనిపెట్టిన ఈ చమురు క్షేత్రం నుండి 1991లో చమురు ఉత్పత్తిని ప్రారంభించారు. 200.26 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో చమురు ఉత్పత్తి ప్రారంభమైనప్పడి నుండి నిలకడా ఉంది. ఇక్కడ ఉన్న మొత్తం 52 బావుల్లో 33 ప్రస్తుతం పనిచేస్తున్నాయి. దీంతో చమురు ఉత్పత్తి ఈ ప్రాంతంలో గణనీయంగా పెరుగుతుంది.

CSS టెక్నాలజీని విజయవంతంగా 2018లో మొదటిసారిగా పరీక్షించారు. దీంతో చమురు ఉత్పత్తి పెరిగింది, దీంతో చాలా తక్కువ నిల్వలు కలిగిన ఈ ఆయిల్ ఫీల్డ్‌ నుండి భారీ స్థాయిలో చమురును వెలికితీయడం సాధ్యమైంది. భారతదేశంలో థర్మల్ ఎన్‌హాన్స్‌డ్ ఆయిల్ రికవరీకి కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ఈ విజయం, దీర్ఘకాలిక ఇంధన భద్రతను పెంపొందిస్తూ, దిగుమతి చేసుకునే ముడి చమురుపై భారతదేశం ఆధారపడటాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu