Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీడీపీకి మహానాడులో భారీగా విరాళాలు, రూ. 25 కోట్లు వచ్చినట్టుగా ప్రకటన... టాప్‌లో ఎవరంటే

టీడీపీకి మహానాడులో భారీగా విరాళాలు, రూ. 25 కోట్లు వచ్చినట్టుగా ప్రకటన... టాప్‌లో ఎవరంటే

Times Now Telugu 2 weeks ago

తెలుగుదేశం పార్టీ మహానాడు వైభవంగా జరిగింది. అయితే ప్రతి ఏడాది నిర్వహించే మహానాడును ఈ ఏడాది పొదుపు చర్యల్లో భాగంగా హైబ్రిడ్ పద్దతిలో నిర్వహించారు.

రెండు రోజుల పాటు సాగిన మహానాడు గురువారం ముగిసింది. అయితే ప్రతి ఏడాది మాదిరిగానే మహానాడులో పలువురు నేతలు పార్టీకి విరాళాలు అందజేశారు. ఈ ఏడాది కూడా టీడీపీకి మహానాడు సందర్భంగా భారీగా విరాళాలు అందాయి. రెండు రోజుల పాటు నిర్వహించిన మహానాడులో టీడీపీ రూ.25.61 కోట్ల విరాళాలు అందాయి. తొలి రోజైన బుధవారం రూ.12.44 కోట్ల విరాళం రాగా.. గురువారం రూ.13.17 కోట్లు వచ్చాయి. పార్టీ నేతలు, కార్యకర్తల, అభిమానులు ఈ విరాళాలు అందజేశారు. దాతల పేర్లను సీఎం చంద్రబాబు మహానాడు వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు.

అయితే మహానాడులో అత్యధికంగా విరాళం అందించినవారిలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు నిలిచారు. ఒక్క వేమిరెడ్డి దంపతులే రూ. 5 కోట్లు విరాళంగా అందించారు. ఈ ఏడాది మహానాడులో అత్యధిక విరాళం అందించింది వీరే. తొలి రోజు అత్యధిక విరాళాలు అందించినవారిలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి రూ. 1.50 కోట్లు, రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్‌ రూ.1.50 కోట్లు ప్రకటించారు. మంత్రులు టీజీ భరత్ రూ. కోటి, బీసీ జనార్దన్‌రెడ్డి రూ. కోటి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాష్యం రామకృష్ణ రూ.కోటి విరాళం ఇచ్చారు.

రెండో రోజు విరాళాలలో రాజగోపాల్‌ (ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రా) రూ.1.50 కోట్లు, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రూ. కోటి, రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి రూ. కోటి, కంభంపాటి రామ్మోహన్‌రావు రూ. కోటి, నారాయణ విద్యా సంస్థలు రూ.కోటి ఉన్నాయి.

ఎక్కువ మొత్తం విరాళాలు అందించినవారిలో కొందరి పేర్లు...
మంత్రి సవిత... రూ.50 లక్షలు
ఎమ్మెల్యే అఖిలప్రియ... రూ.25 లక్షలు
దామచర్ల సత్య... రూ.20 లక్షలు
ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ... రూ.10 లక్షలు
శిష్ట్లా లోహిత్‌... రూ.10 లక్షలు,
కొండేపాటి గంగాప్రసాద్‌ (తిరుపతి)... రూ.50 లక్షలు
ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్... రూ. 10 లక్షలు
ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి... రూ. 15 లక్షలు
మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు... రూ. 10 లక్షలుః
మన్నవ మోహన్ కృష్ణ... రూ. 27 లక్షలు
ఎమ్మెల్యే పులివర్తి నాని... రూ. 19 లక్షలు
దగ్గుమళ్ళ ప్రసాదరావు... రూ. 10 లక్షలు
ఉండవల్లి శ్రీదేవి... రూ. 10 లక్షలు
శంకర్ రెడ్డి (సత్తివేడు)... రూ. 25 లక్షలు
కోమటి జయరాం... రూ. 10 లక్షలు
చంద్రప్రకాష్ (చిత్తూరు)... రూ. 10 లక్షలు
జేబీ శ్రీనివాస్... రూ. 10 లక్షలు
జగన్ మోహన్ (చిత్తూరు)... రూ. 10 లక్షలు
డాలర్ దివాకర్... రూ. 10 లక్షలు
మామిడి గోవింద్... రూ. 10 లక్షలు

అయితే మహానాడు వేదికగా విరాళాల సేకరించడం ఆనవాయితీగా వస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. గతంలో ఎన్టీఆర్ మహానాడు వేదిక వద్ద హుండీ పెట్టి డబ్బులు కలెక్షన్ చేశారని గుర్తుచేశారు. అక్కడే లెక్కింపు చేపట్టి, వివరాలు వెల్లడించి జవాబుదారీతనంగా ఉంటూ వచ్చామని తెలిపారు. పార్టీ కోసం సేవలు అందించడంలో వివిధ రకాలు ఉంటాయని తెలిపారు. పార్టీ కోసం విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్క నాయకుడిని అభినందిస్తున్నట్టుగా చెప్పారు. ఎవరైనా సరే నీతి, నిజాయితీగా సంపాదించాలని పిలుపునిచ్చారు. నీతి, నిజాయితీగా సంపాదించిన దాంట్లో మనకు గౌరవమిచ్చిన పార్టీ ఎంత వీలు అయితే అంత విరాళం అందించాలని కోరారు. అలా అయితే పార్టీ శాశ్వతంగా ఉంటుందని, కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu