Dailyhunt
టీవీఎస్  ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2026 ధరలు...స్టైలిష్ సిటీ బెస్ట్ స్కూటర్ రేంజ్,ఫీచర్స్

టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2026 ధరలు...స్టైలిష్ సిటీ బెస్ట్ స్కూటర్ రేంజ్,ఫీచర్స్

Times Now Telugu 1 week ago

టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక డిజైన్, స్మార్ట్ టెక్నాలజీ, పర్యావరణహిత ప్రయాణాన్ని అందించే వాహనంగా ప్రాచుర్యం పొందింది . లిథియం-అయాన్ బ్యాటరీతో మంచి రేంజ్ అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది .

వేగవంతమైన ఛార్జింగ్ ఆప్షన్లు, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు, సేఫ్టీ ఫీచర్స్ తో నగర జీవనశైలికి సరైన ఎంపికగా నిలుస్తుంది . TVS కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలతో వినియోగదారుల అంచనాలను అందుకుంటూ ఈ మోడల్ తో ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్ లో స్ట్రాంగ్ పొజిషన్ లో నిలిచింది . Orbiterలోని సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం, ఆకర్షణీయమైన రంగులు, ఆధునిక ఫీచర్ల తో రోజువారీ ప్రయాణాల్లో కంఫర్ట్ కోరుకునే ప్రతి ఒక్కరికీ ఇది సరైన ఎంపిక. పర్యావరణాన్ని కాపాడుతూ ఆధునిక జీవనశైలికి తగిన అనుభవాన్ని అందించే TVS Orbiter ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో బెస్ట్ ఎంపిక.
TVS Orbiter
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నగర ప్రయాణాలకు అనువుగా రూపొందించారు . ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది.V1 వేరియంట్ 1.8 kWh బ్యాటరీ తో 86 km రేంజ్ అందిస్తుంది .V2 వేరియంట్ 3.1 kWh బ్యాటరీ 158 km రేంజ్ అందిస్తుంది . లిథియం-అయాన్ బ్యాటరీతో పవర్ , వేగవంతమైన ఛార్జింగ్ ఆప్షన్లను అందిస్తుంది. V1 మోడల్ 0-80% ఛార్జ్ కావడానికి 2 గంటలు 20 నిమిషాలు పడుతుంది . V2 మోడల్ 4 గంటలు 10 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. టాప్ స్పీడ్ 68 km/h ఉండటం వల్ల నగర రహదారులపై సులభంగా ప్రయాణించవచ్చు.

ఫీచర్స్
Orbiterలో SmartXonnect యాప్ కనెక్టివిటీ, రెజెనరేటివ్ బ్రేకింగ్, సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్, జియో-ఫెన్సింగ్, క్రాష్ అలర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. 600+ భద్రతా పరీక్షలు పూర్తి చేసిన ఈ స్కూటర్ వినియోగదారుల కు అత్యంత భద్రతను అందిస్తుంది .

సౌకర్యవంతమైన సీటింగ్, మినిమలిస్టిక్ డిజైన్, క్రిస్టల్ LED హెడ్ లాంప్స్, ఫ్రంట్ & బ్యాక్ కాంబినేషన్ లైట్స్ , స్ట్రెయిట్ లైన్ ఫుట్ బోర్డు , క్రూజ్ కంట్రోల్ , హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ అసిస్ట్ ఉన్నాయి.

ఆకర్షణీయమైన రంగులు Martian Copper, Stratos Blue, Lunar Grey, Stellar Silver, Cosmic Titanium, Neon Sunburst ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి .3 సంవత్సరాలు లేదా 50,000 km వారంటీ అందిస్తుంది.
ధరలు
టీవీఎస్ ఆర్బిటర్ V1 వేరియంట్ హైదరాబాద్ ఎక్స్ షో రూమ్ ధర Rs 95550/-
టీవీఎస్ ఆర్బిటర్ V2 వేరియంట్ హైదరాబాద్ ఎక్స్ షో రూమ్ ధర Rs 112500/-
TVS కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్ లో తన స్థాన్నాన్ని స్ట్రాంగ్ గా ఉంచుకునేలా ఆర్బిటర్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ఇది పర్యావరణహిత , రోజువారీ ప్రయాణాల్లో ప్రతి ఒక్కరికీ సరైన ఎంపిక. ఈ స్కూటర్ వినియోగదారుల అంచనాలను అందుకుంటూ ఆధునిక జీవనశైలికి తగిన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా అత్యంత ప్రజాదరణ పొందుతుంది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu