Dailyhunt
ట్రయంఫ్ ట్రాకర్ 400 vs 2026 రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350:ధరలు,మైలేజ్,ఫీచర్స్ పరంగా క్లాసిక్ బైక్ లలో ఏది బెస్ట్ ?

ట్రయంఫ్ ట్రాకర్ 400 vs 2026 రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350:ధరలు,మైలేజ్,ఫీచర్స్ పరంగా క్లాసిక్ బైక్ లలో ఏది బెస్ట్ ?

Times Now Telugu 1 week ago

మోటార్‌సైకిల్ మార్కెట్ లో కొత్తగా లాంచ్ అయిన ట్రయంఫ్ ట్రాకర్ 400 , 2026 రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బైక్స్‌ రెండు 350cc సెగ్మెంట్‌లో వినియోగదారులలో ఆసక్తిని రేపుతున్నాయి .

ట్రాకర్ 400 తన స్పోర్టీ లుక్‌, ఆధునిక టెక్నాలజీ, శక్తివంతమైన ఇంజిన్‌తో యువ రైడర్లను ఆకర్షిస్తే హంటర్ 350 తన క్లాసిక్‌ డిజైన్‌, సౌకర్యవంతమైన రైడింగ్‌ అనుభవం, రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్‌ వారసత్వంతో ప్రత్యేకతను చూపిస్తోంది. ఈ రెండు బైక్స్‌ మధ్య ఫీచర్లు, పెర్ఫార్మన్స్ , ధర, రోడ్‌ ప్రెజెన్స్‌ వంటి అంశాల్లో తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. రైడింగ్‌ స్టైల్‌ , వ్యక్తిగత ఇష్టాల ఆధారంగా ఏది మీకు సరిపోతుందో ఎంపిక చేసుకోవచ్చు.రెండిటిలో మీకు ఏది బెస్టో చూద్దాం
ట్రయంఫ్ ట్రాకర్ 400
ట్రయంఫ్ ట్రాకర్ 400 మోటార్‌సైకిల్ మార్కెట్లో కొత్తగా లాంచ్ అయింది . ఇది క్లాసిక్ డిజైన్‌తో పాటు ఆధునిక టెక్నాలజీని కలిపి ప్రత్యేకమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ బైక్‌లో350cc లిక్విడ్-కూల్డ్, సింగల్-సిలిండర్ ఇంజిన్ తో 41.4 HP@ 9,000 rpm పవర్ , 37.5 Nm @ 7,500 rpm టార్క్ ను అందిస్తుంది . టార్క్-అసిస్ట్ క్లచ్ , స్మూత్ గేర్ షిఫ్ట్స్ వల్ల నగర రైడింగ్‌ స్మూత్ గా ఉంటుంది

ఫీచర్స్
ఫ్లాట్-ట్రాక్ రేసింగ్ నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లో బాక్సీ ఫ్యూయల్ ట్యాంక్, వైడ్ హ్యాండిల్‌బార్స్, రేస్-స్టైల్ గ్రాఫిక్స్ ఉన్నాయి. Upright రైడింగ్ పొజిషన్ , ఎల్బోస్-అవుట్ స్టాన్స్ రైడర్‌కు డామినెంట్ లుక్ ఇస్తాయి.
సేఫ్టీ పరంగా ఫ్రంట్ 300 mm డిస్క్ , బ్యాక్ 230 mm డిస్క్ బ్రేక్స్ డ్యూయల్-చానల్ ABS, స్విచ్‌బుల్ ట్రాక్షన్ కంట్రోల్, 43mm USD ఫ్రంట్ ఫోర్క్స్, గ్యాస్-చార్జ్డ్ రియర్ మోనోషాక్ సస్పెన్షన్స్ వంటి ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి . ప్రీమియం కంపోనెంట్స్ , హై-స్టాండర్డ్ ఫినిష్ వల్ల దీని నాణ్యత మరింత మెరుగ్గా ఉంటుంది.

దీనికి 2 సంవత్సరాల అన్‌లిమిటెడ్ మైలేజ్ వారంటీ , 12 నెలలు లేదా 10,000 మైళ్ళ సర్వీస్ ఇంటర్వెల్ రైడర్లకు నమ్మకాన్ని కలిగిస్తాయి.కలర్ ఆప్షన్లలో అల్యూమినియం సిల్వర్, రేసింగ్ యెల్లో, ఫాంటమ్ బ్లాక్ అందుబాటులో ఉన్నాయి
ధర
ట్రయంఫ్ ట్రాకర్ ఎక్స్ షూ రూమ్ ధర 2,46,225/- లక్షలు
2026 రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350
రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 లేటెస్ట్ మోడల్ 349cc J-సిరీస్‌ BS6 ఇంజిన్‌తో వస్తుంది. ఇది 20.2 BHP పవర్‌ , 27 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో స్లిప్-అసిస్ట్ క్లచ్ కలిగి ఉండటం వల్ల గేర్‌ మార్పులు సాఫీగా జరుగుతాయి.సుమారు 36.2 kmpl మైలేజ్ ఇస్తుంది.

ఫీచర్స్
కొత్త LED హెడ్‌లైట్‌, ట్రిప్పర్ పోడ్ నావిగేషన్‌, USB టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఆధునిక ఫీచర్లు ఈ బైక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. 13 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌, ట్యూబ్‌లెస్ టైర్స్, ముందు 300mm డిస్క్‌, వెనుక 270mm డిస్క్ బ్రేకులు ABS సిస్టమ్‌తో రైడింగ్‌ సేఫ్టీని పెంచుతుంది. CEAT టైర్స్ తడి రోడ్లపై మంచి గ్రిప్‌ను అందిస్తాయి.

కొత్త Mumbai Yellow, Moonshot White వంటి కలర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ధర ₹1.50 లక్షల నుండి ₹1.70 లక్షల వరకు ఉంటుంది.
ఈ బైక్ సిటీ రైడింగ్‌కి తేలికైన హ్యాండ్లింగ్‌, క్లాసిక్ డిజైన్‌, ఆధునిక టెక్నాలజీ కలయికతో యువతకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu