Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'త్రికాల' మూవీ రివ్యూ: శ్రద్ధా దాస్, మాస్టర్ మహేంద్రన్ నటించిన మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్...

'త్రికాల' మూవీ రివ్యూ: శ్రద్ధా దాస్, మాస్టర్ మహేంద్రన్ నటించిన మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్...

Times Now Telugu 3 weeks ago

థ ఏంటంటే..కుమారి ఖండం అనే పౌరాణిక భూభాగంలో మునులు, అత్యంత శక్తివంతమైన తాంత్రిక గ్రంథాలను అసురుల చేతికి చిక్కకుండా ఓ సీక్రెట్ ప్లేస్‌లో దాచి పెడతారు.

దాన్ని కాపాడేందుకు ఓ ఆయుధాన్ని కూడా సృష్టిస్తారు. అయితే దీన్ని కాపాడే ప్రయత్నంలో వీరరాజు త్రికాల వర్మ, అసుర శక్తులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోతాడు. కలియగంలో ప్రపంచానికి ముప్పు వచ్చినప్పుడు అతని ఆత్మ తిరిగి బయటికి వస్తుందని మునులు వరం ఇస్తారు.

కట్ చేస్తే... శివ, తన ప్రియురాలి కోసం సిటీకి వస్తాడు. ఎండను తట్టుకోలేక విచిత్ర వ్యాధితో బాధపడుతున్న వైతరణ్ అనే వ్యక్తిని కలుస్తాడు శివ. అసలు ఈ వైతరణ్ ఎవరు? శివ వాడే మొబైల్ ఫోన్‌లో ఏముంది? సైకియాట్రిస్ట్ మాయ (శ్రద్ధా దాస్)కి వచ్చిన సమస్య ఏంటి? త్రికాల వర్మ ఆత్మ తిరిగి ప్రాణం పోసుకుందా? అసుర శక్తుల బారి నుంచి ఈ ప్రపంచాన్ని ఎవరు కాపాడారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే 'త్రికాల' మూవీ చూడాల్సిందే.

  • డిఫరెంట్ కాన్సెప్ట్...

కాన్సెప్ట్ పరంగా 'త్రికాల' ఓ సోషియో ఫాంటసీ మూవీ. అందులో ఇందులో మైథాలజీ, హర్రర్, కర్మ సిద్ధాంతాన్ని జోడించాడు డైరెక్టర్ మణి తెల్లగూటి. బలమైన కథతో సెట్స్ మీదకి వెళ్లినట్టుగా సినిమా చూస్తే తెలుస్తోంది. ఈ మూవీలో హీరో మాస్టర్ మహేంద్రన్ అయినా, అజయ్ క్యారెక్టర్‌కి ప్రాధాన్యం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది.

అజయ్ క్యారెక్టరైజేషన్, మాస్కులు, కాస్ట్యూమ్స్ కూడా కొత్తగా ఉంటాయి. ఛైల్ట్ ఆర్టిస్ట్‌గా ఎంతో అనుభవం ఉన్న మహేంద్రన్, తన క్యారెక్టర్‌లో సహజంగా నటించి మెప్పించాడు. శ్రద్ధా దాస్ తన గ్లామర్‌తో యాక్టింగ్‌తో అదరగొట్టింది. దాదాపు 40 ఏళ్ల వయసులోనూ తరగని అందంతో స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది శ్రద్ధా దాస్.. సీనియర్ నటి ఆమని, హీరోయిన్ సాహితికి మంచి పాత్రలు దక్కాయి.

  • డార్క్ థీమ్‌తో ఓ ఊహా ప్రపంచంలోకి...

'త్రికాల' మూవీని ఓ డార్క్ థీమ్‌తో చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ మణి తెల్లగూటి. తాను అనుకున్న కథను స్క్రీన్‌పై తీసుకొచ్చేందుకు ఫ్రేమింగ్‌ని భిన్నంగా ఎంచుకున్నాడు. ముఖ్యంగా త్రికాల ఎపిసోడ్స్ చాలా వైవిధ్యంగా అనిపిస్తాయి. వీఎఫ్‌ఎక్స్ వర్క్ కూడా బాగుంది. బడ్జెట్‌ పరంగా చిన్న సినిమా అయినా విజువల్స్ టాప్ క్లాస్‌గా అనిపిస్తాయి.

సినిమాటోగ్రాఫర్ పవన్ చెన్నా వర్క్ బాగుంది. 'త్రికాల' మూవీ థీమ్ దెబ్బ తినకుండా సీన్స్‌ని బంధించాడు. ఈ మూవీకి మరో అట్రాక్షన్ హర్షవర్థన్ రామేశ్వర్ మ్యూజిక్. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి సినిమాలకు సంగీతం అందించిన హర్షవర్థన్ రామేశ్వరన్, తన మ్యూజిక్‌తో సినిమాని మరో లెవెల్‌కి తీసుకెళ్లాడు. అలాగే షాజిత్ హుమాయున్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వర్కవుట్ అయ్యింది.

ఫస్టాఫ్‌లో వచ్చే సీన్స్, 'త్రికాల' మూవీపై ఆసక్తి క్రియేట్ చేస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండాఫ్‌లో కాస్త నెమ్మదిగా సాగినా.. ప్రీ క్లైమాక్స్ నుంచి మూవీలో హై పెరుగుతుంది. క్లైమాక్స్ కూడా బాగానే వర్కవుట్ అయ్యింది. కథ మరీ పెద్దది కావడంతో సాధారణ ప్రేక్షకులకు కాస్త కంఫ్యూజన్‌గా అనిపించొచ్చు.

ఓవరాల్‌గా 'త్రికాల' మూవీ ఓ భిన్నమైన అనుభూతిని మిగిల్చే మైథలాజికల్ హర్రర్ థ్రిల్లర్. డిఫరెంట్ సినిమాలను ఇష్టపడేవారికి 'త్రికాల' మూవీ కచ్ఛితంగా నచ్చుతుంది. - 3/5

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu