బజాజ్ ఆటో Avenger 160 Street మోడల్ బైక్ ఉత్పత్తి నిలిపివేసింది . దీని స్థానంలో Avenger 220 Street ను లాంచ్ చేయనుంది. బజాజ్ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ మోడల్ ను తొలగిచడం ద్వారా ఈ మోడల్ ను డిస్ కంటిన్యూ చేస్తున్నట్లు కంఫర్మ్ అయింది.
160.4cc ఇంజిన్‌తో 14.8 bhp పవర్, 13.7 Nm టార్క్ అందించిన ఈ మోడల్ ఎంట్రీ-లెవల్ క్రూయిజర్ ఇష్టపడే రైడర్లకు సరైన ఎంపికగా నిలిచింది. ఇప్పుడు కంపెనీ పవర్ఫుల్ Avenger 220 Street ను తిరిగి ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. 2020లో నిలిపివేయబడిన ఈ మోడల్ 220cc ఆయిల్-కూల్డ్ ఇంజిన్, స్పోర్టీ లుక్‌తో, చిన్న హ్యాండిల్‌బార్, మ్యాట్ బ్లాక్ ఫినిష్, అలాయ్ వీల్స్ వంటి ప్రత్యేకతలతో వస్తుంది. రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండే ఈ బైక్ సిటీ రైడింగ్‌కు అనువుగా రూపొందించారు. బజాజ్ వెబ్‌సైట్‌లో ఇప్పటికే Coming Soon ట్యాగ్‌తో లిస్ట్ చేయబడిన ఈ మోడల్ త్వరలో లాంచ్ కానుంది
బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్ బైక్
బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్ బైక్ క్రూయిజర్ సెగ్మెంట్‌లో ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. 220cc ఆయిల్-కూల్డ్ DTS-i ఇంజిన్‌తో ఇది 19.03 PS పవర్ , 17.55 Nm టార్క్ అందిస్తుంది. ఈ శక్తివంతమైన ఇంజిన్ సిటీ రైడింగ్‌కు సరైన పెర్ఫార్మన్స్ అందించడమే కాకుండా లాంగ్ ప్రయాణాల్లో కూడా విశ్వసనీయ అనుభవాన్ని అందిస్తుంది . ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ మెరుగైన మైలేజ్ ,స్మూత్ రైడింగ్‌ను అందిస్తుంది.
ఫీచర్స్
డిజైన్ పరంగా లో-స్లంగ్ సీటు, స్ట్రీట్ కంట్రోల్ హ్యాండిల్‌బార్, కుషన్ బ్యాక్‌రెస్ట్ వంటి ఫీచర్లు రైడర్ , పిలియన్‌కు కంఫర్ట్ కలిగిస్తాయి. అలాయ్ వీల్స్, మ్యాట్ బ్లాక్ ఫినిష్, స్పోర్టీ లుక్ ఈ బైక్‌ను యువతకు ఆకర్షణీయంగా ఉంటాయి . సేఫ్టీ పరంగా సింగిల్ ఛానల్ ABS, 280 mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్ , బ్యాక్ 130 mm డ్రమ్ బ్రేక్స్ , ఫ్రంట్ టేలీస్కోపిక్ , బ్యాక్ 5 స్టెప్ అడ్జెస్ట్ ట్విన్ షాక్ అబ్జార్బర్ వంటి ఫీచర్లు రైడింగ్ కి భద్రతను అందిస్తాయి.
1490 mm వీల్ బేస్ , 169 mm గ్రౌండ్ క్లియరెన్సు , 160 kg కెర్బ్ వెయిట్ 13 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ తో ఉంటుంది. Ebony Black , Cocktail Wine Red అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది .
ఈ బైక్ డీటెయిల్స్ బజాజ్ వెబ్ సైట్ లో అయితే అందించారు. దీని ధరలు బైక్ లాంచ్ రోజు ప్రకటించే అవకాశం ఉంది. బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్ బైక్ స్టైలిష్ లుక్‌తో పాటు సిటీ రైడింగ్‌కు అనువుగా రూపొందించారు . బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్ శక్తివంతమైన ఇంజిన్, ఆధునిక టెక్నాలజీ, సౌకర్యవంతమైన డిజైన్, భద్రతా ఫీచర్లతో క్రూయిజర్ బైక్ ఇష్టపడేవారికి సరైన ఎంపికగా నిలుస్తుంది.
Read more news like this on telugu.timesnownews.com

