Dailyhunt
TVK Victory: విజయ్‌కి కైలాస నుండి అభినందనలు తెలిపిన నిత్యానందమయి అలియాస్ నటి రంజిత!

TVK Victory: విజయ్‌కి కైలాస నుండి అభినందనలు తెలిపిన నిత్యానందమయి అలియాస్ నటి రంజిత!

Times Now Telugu 1 week ago

మిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాల్లో విజయం సాధించి TVK అతి పెద్ద పార్టీగా నిలిచింది. దీంతో పార్టీ అధినేత, నటుడికి పలువురు ప్రముఖలు శుభాకాంక్షలు చెబుతున్నారు.

తాజాగా మాజీ నటి, నిత్యానందమయి, స్వామి నిత్యానంద శిష్యురాలు రంజిత...విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

2019లో దేశం విడిచి పరారై స్వామి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస పేరుతో ఓ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు నిత్యానంద. మాజీ నటి రంజిత, ఈ కైలాస దేశానికి రంజిత ప్రధానమంత్రిగా ఉన్నారు. కైలాస ప్రాంతానికి ప్రధానిగా చెప్పుకుంటూ ఆమె టీవీకే అధినేత విజయ్‌ను అభినందించారు.

నిత్యానందమయి, కైలాస ప్రధాన మంత్రి... విజయ్‌కు అభినందనలు తెలుపుతుందంటూ ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ భారీ విజయం సాధించడం పట్ల ఆ పార్టీ అధినేత విజయ్, పార్టీ సభ్యులకు అభినందనలు తెలియజేస్తున్నట్లు పోస్టులో పేర్కొన్నారు. హిందూ మత సర్వోన్నత పీఠాధిపతి (SPH)భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం వారి ఆశీస్సులు తమిళనాడు ప్రజలపైనా, విజయ్ పరిపాలనపైనా ఉంటాయని ఆమె తెలిపారు.

నిత్యానంద, 2019లో భారతదేశాన్ని విడిచి పరారై స్వామి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస పేరుతో ఓ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రాంతానికి మాజీ నటి రంజితను ప్రధానమంత్రిగా ప్రకటించారు. నిత్యానంద ఏర్పాటు చేసిన ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశానికి పౌరసత్వం కూడా ఇస్తున్నారు.

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస పేరుతో ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పుకుంటున్నట్లు నిత్యానంద స్వామి తెలిపారు. కొన్నేళ్ళ క్రితం కైలాస దేశం నుంచి ఐక్యరాజ్యసమితికి ప్రతినిధి కూడా హాజరైనట్లు వార్తలు వచ్చాయి. క్యరాజ్యసమితి కీలక సమావేశంలో కైలాస దేశ ప్రతినిధిగా విజయప్రియ నిత్యానంద అనే మహిళ హాజరయ్యారు.

నిత్యానంద కైలాస ఎక్కడుంది తెలుసా?
వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త నిత్యానంద స్వామి భారత్‌లో కిడ్నాప్,అత్యాచారం వంటి పలు ఆరోపణలు ఎదుర్కొంటూ 2019లో దేశం విడిచి పరారయ్యారు. నిత్యానంద ఏర్పాటు చేసుకున్న కైలాస దేశం ఈక్వెడార్ సమీపంలోని దీవుల్లో ఒకదానిలో ఉందని పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి.

తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందిన టీవీకే అధినేత, హీరో విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి ఎంకే స్టాలిన్ రాజీనామా చేశారు.ఈ మేరకు తన రాజీనామా లేఖను మంగళవారం గవర్నర్‍కు పంపించారు. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే కూటమికి 72 స్థానాలు రాగా అన్నాడీఎంకేకు 53 స్థానాలు పొందింది. టీవీకే పార్టీకి 108 స్థానాల్లో గెలుపొందింది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు ఏ పార్టీకి రాలేదు. టీవీకే పార్టీ అధికారంలోకి రావాలంటే మరో 10 మంది మద్దతు కావాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్న విజయ్, గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. మ్యాజిక్ ఫిగర్ కోసం ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే అంశంపై ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu