అమెరికా-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. త్వరలో ఇరాన్‌తో ఒప్పందం కుదురే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఇరాన్ దేశం, తన వద్ద ఉన్న అత్యంత శుద్ది చేసిన యురేనియం నిల్వలను వదులుకునేందుకు అంగీకరించింది. దీంతో అమెరికా- ఇరాన్ యుద్ధం ముగిసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇద్దరు అమెరికా అధికారులను పేర్కొంటూ, న్యూయార్క్ టైమ్స్ ఈ విషయాన్ని రిపోర్ట్ చేసింది. ఇరు దేశాల మధ్య జరిగిన దౌత్య ప్రయత్నాలలో ఒక కీలక మలుపును సూచిస్తుంది. టెహ్రాన్,ఒక సాధారణ ప్రకటనలో టెహ్రాన్ ఈ మెటీరియల్‌ను అప్పగించడానికి అంగీకరించినప్పటికీ, శుద్ది చేసిన యురేనియం నిల్వలను ఎలా వదులుకోవాలనే అంశంపై ఖచ్చితమైన వివరాలు ఇంకా ఖరారు కాలేదు , అధికారిక ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత వాటిని ఖరారు చేయనున్నారు. వాషింగ్టన్‌లో జరిగిన పలు కీలక దౌత్యప్రయత్నాల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఒక సమగ్ర అవగాహన ఒప్పందాన్ని (MoU) కుదుర్చుకోవడానికి, ప్రాంతీయ నాయకుల విస్తృత కూటమితో ఉన్నత స్థాయి చర్చలలో పాల్గొంటున్నట్లు, ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
శ్వేత సౌధం అధికారులు, అమెరికా- ఇరాన్ మధ్య జరిగిన ఈ దౌత్య ఒప్పంద ప్రక్రియలో సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్; యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్; ఖతార్ ఎమిర్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ , ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ థానీ తో పాటు పాకిస్తాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్, టర్కీ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి, జోర్డాన్ దేశ రాజు అబ్దుల్లా II , బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాలతో ప్రత్యక్ష సంప్రదింపులు జరిగాయి.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ విషయంపై తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో అమెరికా, ఇరాన్ ఒక విస్తృత ఒప్పందానికి దగ్గరవుతున్నాయని, ప్రతిపాదిత అవగాహనలో భాగంగా హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య జరగనున్న ఈ ఒప్పందం చర్చల దశలో ఉందని ట్రంప్ తెలిపారు.
అమెరికా-ఇరాన్ యుద్ధం సమయంలో ఇరాన్ వద్ద ఉన్న 60 శాతం శుద్ది చేసిన యురేనియం నిల్వలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టార్గెట్ చేసినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో పేర్కొంది. ఇరాన్ దేశం వద్ద అణ్వాయుధ తయారీకి అవసరమైన స్థాయిలో శుద్దిచేసిన యురేనియం నిల్వలు ఉన్నాయి. ఆ యురేనియం నిల్వలను అమెరికాకు అప్పగించేలా చాలా కాలంగా ఒత్తిడి చేస్తోంది. యుద్దం ముగించేందుకు చేసే చర్చల్లో భాగంగా ఈ అంశాన్ని చేర్చేందుకు అగ్రరాజ్యం ప్రయత్నిస్తుంది.
దాదాపు 30 ఏళ్ల క్రితం అమెరికా ప్రభుత్వం ఆపరేషన్ సఫైర్ ను చేసింది. కజకిస్తాన్‌లోని ఉల్బా మెటలర్జికల్ ఫెసిలిటీ అనే ప్రాంతంలో నిల్వ ఉంచిన దాదాపు 600 కిలోగ్రాముల HEU (అత్యంత సుసంపన్నమైన యురేనియం)ను ఈ ఆపరేషన్ ద్వారా కనిపెట్టారు.

