ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్... మెటా తాజాగా మరో కొత్త ఫీచర్‌ను లాంఛ్ చేసింది. ఇన్‌కాగ్నిటో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
దీని ద్వారా ఏఐ చాట్‌బాట్స్‌తో ప్రైవేట్ కన్వర్జేషన్ చేసుకోవచ్చు. ఇన్‌కాగ్నిటో చాట్ మోడ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏఐ చాట్‌బాట్‌తో వినియోగదారులు సున్నితమైన సమాచారాన్ని పంచుకునే విషయానికి సంబంధించి ప్రైవసీ ఆందోళనలు తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెటా తెలిపింది.
గత కొన్ని సంవత్సరాలుగా వాట్సాప్‌లో అందుబాటులో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ అయిన మెటా ఏఐతో ప్రైవేట్‌గా, ఇన్‌కాగ్నిటో చాట్ మోడ్ ద్వారా తాత్కాలికంగా చాట్ చేసే అవకాశం ఉందని ఆ సోషల్ మీడియా కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. మెటా కూడా యాక్సెస్ చేయలేని "సెక్యూర్ ఎన్విరాన్‌మెంట్"లో మెసెజెస్ ప్రాసెస్ చేయబడతాయని, డిఫాల్ట్‌గా సేవ్ చేయబడవని , సెషన్ నుండి ఎగ్జిట్ అయినప్పుడు మెసెజెస్ అదృశ్యమవుతాయని మెటా తెలిపింది. జనరేటివ్ ఏఐ సిస్టమ్స్ ఇప్పటికే ప్రైవసీ విషయంలో పలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి.
ఎందుకంటే ఈ సిస్టమ్ బేస్డ్ లాంగ్వేజ్ మోడల్స్‌కు కొన్నిసార్లు ఏఐ చాట్‌బాట్‌లతో యూజర్స్ షేర్ చేసుకున్న సమాచారంపై, డేటా స్టోరేజీపై ట్రైనింగ్ ఇస్తారు. దీనికి పోటీగా ఇప్పటికే మార్కెట్లో పోటీగా ఉన్న చాట్‌బాట్స్ ప్రైవసీ ఫీచర్స్ అందుబాటులోకి తెచ్చాయి. గూగుల్ జెమిని చాట్‌బాట్‌లో చాట్ హిస్టరీని డిసేబుల్ చేసే ఆప్షన్ ఉంది. దాని ఏఐ మోడల్స్‌కు ట్రైనింగ్ ఇవ్వడంలో డేటాను ఉపయోగించకుండా నిలిపివేసే ఆప్షన్ ఉంది. చాట్‌జీపీటీలో కూడా ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి. దీనితో పాటు యూజర్ల డేటాతో ఏఐ మోడల్స్‌కు ట్రైనింగ్ ఇవ్వకుండా నిరోధించే ఆప్ట్ ఔట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మెటా కూడా ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఏఐ చాట్‌బాట్స్‌తో యూజర్స్ సాధారణంగా ప్రైవేట్ ఫైనాన్షియల్ , హెల్త్, వర్క్ డేటా వంటి సమాచారాన్ని షేర్ చేసుకుంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో మెటా తాజాగా ఇన్‌కాగ్నిటో మోడ్‌ను అందుబాటులోకి తెచ్చింది.
వాట్సప్‌లో మొబైల్ రీఛార్జ్
మెసెంజర్ యాప్ వాట్సప్ ఇటీవల మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాట్సప్ ద్వారానే ఈజీగా ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు నేరుగా వాట్సప్ నుండే మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు. పేయూ (PayU) పార్ట్‌నర్‌షిప్‌తో, వాట్సప్ మెసెంజర్ ఈ సర్వీసెస్ అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్‌కు ఈ ఫీచర్స్‌ను విడతల వారిగా ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. దీంతో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా (VI)జియో యూజర్లు అందుబాటులో ఉన్న రీఛార్జ్ ప్లాన్స్ ద్వారా వాట్సప్ నుండే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు సులభంగా వారి నంబర్ లేదా స్నేహితుల నంబర్‌కు రీఛార్జ్ చేయవచ్చు.
ప్రస్తుతానికి వాట్సప్ ద్వారా మొబైల్ రీఛార్చ్ చేసుకునే ఫీచర్... భారతీ ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా నంబర్స్‌కు సపోర్ట్ చేస్తుంది. వాట్సప్ ద్వారా చేసుకునే ఈ రీఛార్జెస్ విషయంలో సింపుల్‌గా యూపీఐ, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్‌తో రీఛార్జ్ చేసుకునే సదుపాయం ఉంది.
Read more news like this on telugu.timesnownews.com

