మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి లోకేష్ గురువారం రోజున కడప అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ...
వైఎస్ జగన్ సొంతజిల్లాను, సొంత నియోజకవర్గాన్ని కూడా చేశాడని ఆరోపించారు. గురువారం రోజున జగన్ ప్రెస్ మీట్ చూశాక ఆయనకు ఛీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇవ్వొచ్చని అనిపించిందని అన్నారు. జగన్ ఆయన తల్లిని, చెల్లిని తరిమేశారని ఆరోపించారు. బాబాయిని లేపేసి మరో చెల్లి కుటుంబానికి అన్యాయం చేసిన వ్యక్తి జగన్ అని అన్నారు.
''2019లో సొంత బాబాయిని లేపేసింది జగన్.. తొలుత గుండెపోటు అన్నారు. తర్వాత గొడ్డలి వేటు బయటకు వచ్చింది. తర్వాత దొంగపేపర్‌లో నారాసుర రక్తచరిత్ర అని రాసి చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి ఫోటో వేశారు. తర్వాత జగన్ ఎంత మోసగాడో ప్రజలకు అర్థమైంది. అందుకే వైసీపీకి ముద్దుగా గొడ్డని పార్టీ అని పేరుపెట్టాం. రప్పారప్పా అన్నది వారే కదా. జగన్ సినిమా చూపిస్తే ఎండ్ కార్డు వేసే బాధ్యత మా కేడర్‌ది. జగన్ నటనకు ఖచ్చితంగా భాస్కర్ అవార్డు గ్యారంటీగా వస్తుంది. ఆ నటన చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. బయట ముద్దులు పెట్టి, లోపల గొడ్డలి పోటువేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరిని జగన్ మేనమామ చంపేసి, మాపై కేసు పెడతామని బెదిరిస్తారా? ప్రతిపక్షంలోనే మేం భయపడలేదు. ఇప్పుడు కేసులకు భయపడతామా? రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్ మోహన్ రెడ్డి. కడపలో ఒక పెద్దాయన ఎగిరెగిరి పడుతున్నారు. త్వరలో ఆయన టైమ్ కూడా వస్తుంది. చట్టాలు ఉల్లంఘించి పదిలేది లేదు. ఎవరూ ఆయనను కాపాడలేరు'' అని అన్నారు.
''ప్రజలంతా గుండెపై చేయి చేసుకొని ఆలోచించండి. జగన్ సీఎంగా ఉండగా కడపకు ఒక్క పరిశ్రమ తెచ్చారా? ఒక్క సాగునీటి ప్రాజెక్టు తెచ్చారా? అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే బాధితులను పట్టించుకున్నారా? యువగళం పాదయాత్ర సమయంలో ఇదే కడప గడ్డపై నేను మిషన్ రాయలసీమను ప్రకటించాను. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మారుస్తానని మాట ఇచ్చి, ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నాం. గత రెండేళ్లలో రూ. లక్షకోట్ల విలువైన పరిశ్రమలు రాయలసీముకు తెచ్చాం. 2029 ఎన్నికల్లోపు కడప స్టీల్ ప్లాంట్ కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభించేలా నేను బాధ్యత తీసుకుంటా, గొడ్డని పార్టీకి ఫ్యాక్షనిస్టులుంటే మన వద్ద ఫైటర్లున్నారు. పసుపు సైన్యం గుండె ధైర్యం చాలా గొప్పది. అవతల ఎవరున్నా మనం తగ్గేదే లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా ఒక కుటుంబంలా పార్టీ బలోపేతానికి కలసికట్టుగా పనిచేయాలి'' అని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.
''ఇటీవల ఒక సోకాల్డ్ జర్నలిస్టు ఎంత అన్యాయంగా మాట్లాడారో అందరం చూశాం. సైకో బ్యాచ్ కుట్రలు అంతటితో ఆగవు. జనసేన ముసుగులో మనల్ని... టీడీపీ ముసుగులో జనసేనను ఫేక్ అకౌంట్లలో తిడతారు. మనమంతా అప్రమత్తంగా ఉండాలి. కూటమి కార్యకర్తలు, నాయకులు కలసికట్టుగా జగన్ మఠా కుట్రలను తిప్పికొట్టాలి. దేవుడి గడపలో కూడా కుల మతాల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కుట్ర రాజకీయాలను తిప్పికొట్టే బాధ్యత కార్యకర్తలపై ఉంది. గతంలో నా పాదయాత్రలో పాల్గొన్న వారి షాపులు మూయించి వేధించారు. నాకు అండగా నిలిచింది మన పసుపు సైన్యమే. మా విజయం వెనుక కార్యకర్తల కష్టం, త్యాగం దాగి ఉన్నాయి. కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని చిత్తశుద్ధితో అమలుచేస్తున్నాం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే చంద్రబాబు పక్కన సాధారణ నేతలకు పొలిట్ బ్యూరో పదవులిచ్చి కూర్చోబెట్టాం. ప్రతిపక్షంలో ఉన్నపుడు పల్నాడుల తోట చంద్రయ్య మెడపై కత్తిపెట్టి వైసీపీ నేతలు తమ నాయకుడికి జైకొట్టాలని బలవంతంచేస్తే... జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణం విడిచారు. అటువంటి కరుడుగట్టిన కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని కాపాడుకునేందుకే కార్యకర్తే అధినేత అనే నినాదం. కేవలం సంక్షేమం, అభివృద్ధి
మాత్రమే కాదు, కార్యకర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకులపై ఉంది'' అని లోకేష్ తెలిపారు.
Read more news like this on telugu.timesnownews.com

