Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వర్క్‌ఫ్రమ్ హోమ్‌ కార్యాచరణ... సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

వర్క్‌ఫ్రమ్ హోమ్‌ కార్యాచరణ... సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Times Now Telugu 1 week ago

దేశాన్ని కాపాడేందుకు పొదుపు చర్యలు పాటిద్దామని ఆంధ్రప్రదేశ్ ముఖ్య చంద్రబాబు పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశంలోప్రధాని మోదీ పొదుపు చర్యలకు పిలుపునివ్వడంపై కూడా ప్రత్యేకంగా చర్చించారు.

'నా దేశం- నా బాధ్యత' పేరుతో పొదుపుపై ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కాన్వాయ్‌లు తగ్గించుకుంటే సరిపోదని.. ఇతర మార్గాలూ అన్వేషించాలన్నారు. జిల్లా పర్యటనల్లో ఖర్చులతోపాటు విదేశ పర్యటనలూ తగ్గించుకోవాలని సూచించారు. వర్చువల్ విధానానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిద్దామన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ పొదుపు చర్యలపై దృష్టిసారించాలని... ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలను 24-26 మధ్య నడపాలని సీఎం ఆదేశించారు.

వర్క్ ప్రైమ్ హోంపై స్టడీ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇందుకు సంబంధించి కార్యచరణ, విధివిధానాలను రూపొందించాలని చెప్పారు. సౌరశక్తిని పెద్ద ఎత్తున అందిపుచ్చుకోవాలని సూచించారు. దేశం మనకెంతో ఇచ్చిందని.. దానికి కృతజ్ఞతలు చెప్పే సమయం వచ్చిందన్నారు. ప్రజలు బంగారం కొను గోలు తగ్గించాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు. పొదుపు చర్యలను దశలవారీగా చేపడదామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించ గా... సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. ప్రతి నిర్ణ యానికీ ప్రజలను సన్నద్ధం చేసిన తర్వాత ప్రకటన చేద్దామన్నారు.

అగ్రిగోల్డ్ బాధితులకు 6 నెలల్లో న్యాయం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధితులకు న్యాయం చేసేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయా లని నిర్ణయించారు. ఏపీలోనే 11.5 లక్షలకు పైగా బాధితులు ఉన్నారని పేర్కొన్నారు. మరో 8 రాష్ట్రాల్లో సుమారు 20 లక్షలమంది బాధితులున్నారని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వంలో సీఐడీ అధి కారులు కూడా అగ్రిగోల్డ్ సొమ్ము తిన్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 40కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ. 2లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే 25 ప్రాజెక్టులతోపాటు ఉద్యోగాల కల్పనపై కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుద్ధ ఇంధనం, ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, భారీ సోలార్ ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజ్, బయోగ్యాస్ యూనిట్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. శుద్ధ ఇంధనరంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలిపేలా క్యాబినెట్ చర్యలు తీసు కుంది. ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ ప్రణాళికకు ఆమోదం తెలిపింది. డేటా సెంటర్లు, ఆటోమొబైల్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడుల ఆమోదంపై చర్చించింది. కర్నూలు విమానాశ్రయం పీపీపీ మోడల్లో అభివృద్ధి ప్రతిపాదన చర్చకు వచ్చింది. వివిధ సంస్థలకు భూముల కేటాయింపులపై క్యాబినెట్ నిర్ణయం తీసు కుంది. ఎంఎస్ఎంఈలకు నిధుల సౌలభ్యానికి ప్రత్యేక ఏర్పాటుపై చర్చించింది. సాగునీటి కాల్వల విస్తరణ, రోడ్లు, పరిశ్రమలకు మౌలిక సదుపాయాలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu