Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విద్యార్థులకు బిగ్ అలర్ట్... ఏపీ ఐసెట్ పరీక్షా ఫలితాలు విడుదల

విద్యార్థులకు బిగ్ అలర్ట్... ఏపీ ఐసెట్ పరీక్షా ఫలితాలు విడుదల

Times Now Telugu 1 week ago

పీ ఐసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఎంబీఏ,ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ఏపీ ఐసెట్ పరీక్షా ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు.

ఏపీ ఐసెట్ పరీక్షకు 26,219 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే 23,198 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 21,205 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.అంటే 91.41శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇకపోతే కాకినాడ జిల్లాకు చెందిన వైష్ణవి 166.094 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఇకపోతే అభ్యర్థులు తమర్యాంక్ కార్డులను https://cets.apsche.ap.gov.in/ICET అధికారిక వెబ్ సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. అలాగే 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.ఈ సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu