Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు...: ఎంకే స్టాలిన్

విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు...: ఎంకే స్టాలిన్

Times Now Telugu 5 days ago

మిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు అని భావిస్తున్నామని చెప్పారు.

ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని డీఎంకే శ్రేణులకు పిలుపునిచ్చారు. స్టాలిన్ డీఎంకే జిల్లా కార్యదర్శులతో మాట్లాడుతూ... ప్రస్తుత ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని, పార్టీ శ్రేణులు ఎప్పుడు ఎన్నికల వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని కోరారు. ఇటీవలి ఎన్నికల్లో ఓటమితో ఇక డీఎంకే పనైపోయిందని కొందరు చెబుతున్నారన్నారు. గతంలో కూడా ఓటముల నుంచి విజయాల దిశగా డీఎంకే ప్రయాణం సాగించిందని స్టాలిన్ గుర్తు చేశారు. ఓడినప్పుడే ఫీనిక్స్‌ పక్షిలా పుంజుకుంటుందని తెలిపారు. డీఎంకే ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం అనేక పథకాలను అమలు చేసిందని తెలిపారు.

తమిళనాడులో డీఎంకే తిరిగి విజయం సాధిస్తుందని స్టాలిన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ''ఈ ఓటమి తాత్కాలికం. ప్రస్తుత ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు. సిద్ధంగా ఉండండి. 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మనం తిరిగి ఎన్నికల్లో విజయం సాధిస్తాం'' అని స్టాలిన్ అన్నారు.

ఎన్నికల ఓటమికి గల కారణాలను విశ్లేషించి, ప్రజల నుంచి ప్రత్యక్ష అభిప్రాయాన్ని సేకరించేందుకు స్టాలిన్ 36 మంది సభ్యులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దీనిని క్షేత్రస్థాయిలో ప్రజల్లో తిరిగి విశ్వాసాన్ని పొందేందుకు, పార్టీ ఎక్కడ మద్దతు కోల్పోయిందో గుర్తించడానికి డీఎంకే చేస్తున్న ప్రయత్నంగా ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ... ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థాయిలో మెజారిటీ సీట్లను సొంతం చేసుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలుపాల్సిందిగా పలు పార్టీలకే విజయ్ కోరారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్, వీసీకే, వామపక్షాలు, ముస్లిం లీగ్ పార్టీలు మద్దతుతో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో అప్పటికే మద్దతిచ్చిన పార్టీలతో సహాయ... 25 మంది రెబెల్ ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు కూడా విజయ్ ప్రభుత్వానికి లభించింది. దీంత మొత్తం 234 సభ్యులు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వానికి 144 మంది ఎమ్మెల్యేల మద్దతు దక్కింది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu