Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్‌తో మాట్లాడిన రాహుల్ గాంధీ... తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా?

విజయ్‌తో మాట్లాడిన రాహుల్ గాంధీ... తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా?

Times Now Telugu 2 weeks ago

సినీ నటుడు, టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. టీవీకే పార్టీ విజిల్ మోత... దశాబ్దాలుగా తమిళ రాజకీయాలను శాసించిన డీఎంకే, అన్నాడీఎంకేలకు అధికారం దక్కుకుండా చేసింది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే అతిపెద్ద పార్టీగా అవతరించింది. విజయ్ పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించి తమిళ రాజకీయ చరిత్రను తిరగరాసింది. అయితే తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా... ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. దీంతో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

దీంతో టీఎంకే ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది?, ఎవరి మద్దతు తీసుకుంటుంది? అనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విజయ్... ఆ పార్టీ మిత్రపక్షాలపై ఎలాంటి విమర్శలు చేయలేదు. బీజేపీపై కొన్ని సందర్భాల్లో విమర్శలు చేసిన విజయ్... ఎన్డీయే కూటమిలోని అన్నాడీఎంకేతో పాటు, ఇతర పార్టీలను పెద్దగా విమర్శలు చేసిన దాఖలాలు లేవు.

అయితే డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీలతో కాకుండా ఇతర పార్టీల మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. విజయ్...అటు డీఎంకే కూటమిలోని కొన్ని పార్టీలు, అటు అన్నాడీఎంకే కూటమిలోని కొన్ని పార్టీల నుంచి టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మద్దతు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది.

డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ 5, వీసీకే 2, సీపీఐ 2, సీపీఎం 2, డీఎండీకే 1 సీట్లు సాధించాయి. అన్నాడీఎంకే కూటమిలో పీఎంకే 4, ఏఎంఎంకే 1 స్థానంలో గెలిచాయి. అయితే వీరిలో ఎవరి సాయం విజయ్ తీసుకుంటారు?, విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు ఎవరు ముందుకు వస్తారు? అనేది చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా?
తమిళనాడు ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించిన తర్వాత విజయ్‌కు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫోన్ చేసి మాట్లాడారు. టీవీకే విజయాన్ని అద్భుతమైన ఫలితం అని రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఇది పెరుగుతున్న యువత గళాన్ని ప్రతిబింబిస్తుందని... దానిని విస్మరించలేమని, విస్మరించబోమని కూడా పేర్కొన్నారు. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరిలోని కాంగ్రెస్ కార్యకర్తల కృషికి, మద్దతుకు రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ.... తమిళనాడు, పుదుచ్చేరి ప్రజలను రక్షిండం, వారికి సేవ చేయడం కొనసాగిస్తుందని తెలిపారు.

ఇదిలాఉంటే, తమ మిత్రపక్షమైన డీఎంకే అధినేత స్టాలిన్‌తో కూడా రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ పరిణామాలపై కాంగ్రెస్ నేత గిరీష్ చోడంకర్ మాట్లాడుతూ... తమిళనాడులో నెలకొన్న పరిస్థితిపై పార్టీ హైకమాండ్‌కు ఒక నోట్‌ను సమర్పించినట్టుగా తెలిపారు. మరోవైపు టీవీకే అధికార భాగస్వామ్య ప్రతిపాదన చేస్తే... కాంగ్రెస్ పార్టీ దానిని పరిశీలించవచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో విజయ్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.

ఇక, విజయ్ తండ్రి, చిత్రనిర్మాత ఎస్ఏ చంద్రశేఖర్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడి పార్టీతో పొత్తు పెట్టుకోవాలని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. టీవీకేతో పొత్తు ద్వారా ఆయా పార్టీలు కోల్పోయిన రాజకీయ స్థానాన్ని తిరిగి పొందవచ్చని ఆయన అన్నారు.రాజకీయంగా బలహీనపడిన కాంగ్రెస్ వంటి పార్టీలు విజయ్‌తో చేతులు కలిపే అంశాన్ని పరిగణించాలని చంద్రశేఖర్ అన్నారు.

టీవీకే నుంచి తమకు ఎలాంటి పిలుపు రాలేదని, సంకేతాలు అందినట్లయితే తమ తమ రాష్ట్ర కమిటీలే ఏదైనా నిర్ణయం తీసుకుంటాయని సీపీఐ, సీపీఎం నాయకులు తెలిపారు.

మరోవైపు అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకే 4, ఏఎంఎంకే 1 స్థానంలో గెలిచాయి. మరి ఈ పార్టీ సాయం విజయ్ తీసుకుంటారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu