Dailyhunt
VinFast VF MPV 7 ఎలక్ట్రిక్ కార్...7 సీటర్ EV రేంజ్ ,లేటెస్ట్ ఫీచర్స్ , బుకింగ్స్   వివరాలు

VinFast VF MPV 7 ఎలక్ట్రిక్ కార్...7 సీటర్ EV రేంజ్ ,లేటెస్ట్ ఫీచర్స్ , బుకింగ్స్ వివరాలు

Times Now Telugu 2 weeks ago

వియత్నాం ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ VinFast భారత మార్కెట్లోకి తన కొత్త మోడల్ VF MPV 7 ను ఏప్రిల్ 15న అధికారికంగా లాంచ్ చేయనుంది . ఈ కార్ 7 సీటర్ల లేఅవుట్‌తో కుటుంబ వినియోగదారులకు అనుకూలంగా ఉండేలా రూపొందించారు .

విస్తృతమైన కేబిన్ స్పేస్, ఆధునిక డిజైన్, ఎలక్ట్రిక్ డ్రైవ్ అనుగుణంగా మార్కెట్ లోకి రానుంది . SUV ఆధారిత EVలతో పోలిస్తే ఇది ఎక్కువ ప్రాక్టికల్ వినియోగాన్ని అందిస్తుంది. VinFast భారతీయ మార్కెట్లో తన స్థానం నిలబెట్టుకునే లక్ష్యంగా ఈ కార్ ను తీసుకువస్తుంది . ధర అనుబాటులో ఉంటె VF MPV 7 కుటుంబాలకు , ఫ్లీట్ వినియోగదారులకు ఆకర్షణీయమైన ఎంపికగా మారే అవకాశం ఉంది. VinFast ప్రస్తుతం 21,000/- టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్ ప్రారంభించింది .
విన్ ఫాస్ట్ VF MPV 7
VinFast VF MPV 7 భారత మార్కెట్లోకి విడుదల కాబోతున్న కొత్త ఎలక్ట్రిక్ వాహనం. ఇది వియత్నాం సంస్థ VinFast కంపెనీ రూపొందించిన 7 సీటర్ల ఎలక్ట్రిక్ MPV. కుటుంబ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన ఈ కార్ విస్తృతమైన ఇంటీరియర్, ఆధునిక డిజైన్, అత్యంత భద్రతా ఫీచర్లతో వస్తుంది VF MPV 7లో 60.13 kWh కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది . స్పీడ్ ఛార్జింగ్ సౌకర్యం ద్వారా 10% నుండి 70% వరకు కేవలం 30 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది.

డ్రైవింగ్ మోడ్‌లు Eco, Normal, Sport లుగా అందుబాటులో ఉన్నాయి. రెజెనరేషన్ బ్రేక్ మోడ్ కూడా Off, Low, Medium, High లుగా సెట్ చేసుకోవచ్చు. ఈ వాహనం 0-100 km/h వేగాన్ని 10 సెకన్లలోపు చేరుతుంది. అధికారికంగా రేంజ్ వివరాలు వెల్లడించలేదు. 500+ km వరకు ప్రయాణించగలదని సమాచారం .

ఫీచర్స్
ఇంటీరియర్ లో VF MPV 7లో 7 సీటర్ల లేఅవుట్, leatherette upholstery, D-cut స్టీరింగ్ వీల్, మల్టీ- ఫంక్షన్ కంట్రోల్స్, ఆటో అప్/డౌన్ విండోలు యాంటి - పించ్ ఫీచర్స్ ఉన్నాయి .

భద్రతా ఫీచర్లలో ABS, EBD, BA, ESC, TCS, HSA, ROM, TPMS, అల్ డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ , ఆటో హోల్డ్ వంటి ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి.

ఇవి డ్రైవర్ మరియు ప్రయాణికులకు పూర్తి రక్షణను అందిస్తాయి.2840 mm వీల్ బేస్ తో విస్తృతమైన కేబిన్ స్పేస్ లభిస్తుంది. 4740 mm పొడవు, 1872 mm వెడల్పు, 1734 mm ఎత్తు , 235/50 R19 టైర్లతో రోడ్డు మీద స్థిరత్వాన్ని కల్పిస్తుంది. SUVల కంటే MPV డిజైన్ మరింత ప్రాక్టికల్ వినియోగాన్ని అందిస్తుంది.
VF MPV 7 ధరలు ఆఫీసియల్ ఏప్రిల్ 15 లాంచ్ రోజే తెలిసే అవకాశం ఉంది.ఇప్పుడు 21000/- లతో కార్ బుకింగ్ చేసుకోవచ్చు .
VinFast VF MPV 7 భారతీయ EV మార్కెట్లో కుటుంబాలు , ఫ్లీట్ వినియోగదారులకు ఆకర్షణీయమైన ఎంపికగా ఉంటూ గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది .

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu