Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vishwambhara: జూలైలో చిరంజీవి విశ్వంభర విడుదల... వార్తల్లో నిజమెంత?

Vishwambhara: జూలైలో చిరంజీవి విశ్వంభర విడుదల... వార్తల్లో నిజమెంత?

Times Now Telugu 3 weeks ago

చిరంజీవి విశ్వంభర సినిమా విడుదలకు రంగం సిద్ధమైందా? అన్ని అనుకున్నట్టు జరిగితే జులై లోనే విడుదలా? లేటెస్ట్ గా వస్తున్న వార్తల్లో నిజమెంత? బింబిసార వంటి హిట్టు సినిమాను అందించి ఏకంగా రెండో సినిమా ఛాన్స్ మెగాస్టార్ తో పట్టేసాడు విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ.


నిజానికి గతేడాది చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఒక గ్లింప్స్ విడుదల చేసారు. ఆ సందర్భంగా చిరంజీవి విశ్వంభర విశేషాలు చెప్తూ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసారు. ఆ వీడియోలో క్వాలిటీ విషయంలో రాజీపడటం లేదనీ, అందరికీ నచ్చే ఒక విజువల్ వండర్ ను తీర్చిదిద్దుతున్నామంటూ ఆ సినిమా మీద వస్తున్న పుకార్లకు చెక్ పెట్టె ప్రయత్నం చేసారు. 2026 సమ్మర్ లో సినిమా విడుదల అంటూ ఒక లీక్ కూడా ఇచ్చారు. మరి అయన చెప్పిన సమ్మర్ వచ్చేసింది.

ఒక పక్క తనయుడి పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' విడుదల తేదీల్లో రకరకాల మార్పులు జరుపుకుని మొత్తానికి జూన్ 4 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇక ఆ చిత్రం విడుదలయ్యాక జూలై 10 న విశ్వంభర విడుదలకు ముహూర్తం పెట్టినట్టు ఇండస్ట్రీ న్యూస్.


VFX ఆధారం తెరకెక్కుతున్న ఈ ఈ భారీ సోషియో ఫాంటసీ చిత్రం కోసం 250 కోట్లకు పైగానే ఖర్చు పెడుతున్నట్టు అంచనాలు ఉన్నాయి. గత కొద్దికాలంగా ఎటువంటి సౌండ్ లేని సినిమాకు ఇప్పుడు సడన్ గా విడుదల తేదీ గురించి వార్తలు రావడానికి ఆధారం అప్పుడెప్పుడో చిరంజీవి స్వయంగా సమ్మర్ రిలీజ్ అని చెప్పడమే కావొచ్చు.

అయన చెప్పిన మాట ప్రకారం సమ్మర్ రిలీజ్ ఎలాగైనా లేదు, కనీసం జూలై లో ఉన్న గ్యాప్ ను వాడుకుంటే వర్కౌట్ కావొచ్చు అనే స్పెక్యులేషన్లే ఈ విడుదల తేదీ వార్తలకు ఆధారం కావొచ్చు. మరి ఈ తేదీ విషయం ఎంతవరకు నిజమనేది తెలియాలంటే టీం నుండి అధికారిక స్పందన రావాల్సిందే. ఇక ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి RR మాత్రం ఆయన అందించడంలేదనీ, ఆయన ప్లేస్ లో గౌరా హరితో చేయిస్తున్నారనేది లేటెస్ట్ న్యూస్.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu