Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Watermelon: డయాబెటిస్‌తో బాధపడేవారు పుచ్చకాయ తినవచ్చా? మంచిదేనా?

Watermelon: డయాబెటిస్‌తో బాధపడేవారు పుచ్చకాయ తినవచ్చా? మంచిదేనా?

Times Now Telugu 3 weeks ago

వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండేందుకు చాలా మంది ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తగినంత నీరు తాగడం, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవడం, ప్రత్యేకమైన జ్యూసులు,పానీయాలు తాగుతారు.

ఎండకాలంలో పుచ్చకాయలు ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. అయితే డయాబెటిస్‌తో బాధపడేవారు పుచ్చకాయలు తీసుకోవచ్చా? వీటిని తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయం తెలుసుకుందాం!

పుచ్చకాయ తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సుమారుగా 90 శాతం నీరు ఉంటుంది. అయితే ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్‌తో బాధపడేవారు వీటిని తినేందుకు ఆసక్తి చూపరు. గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి పుచ్చకాయలో ఉండే నేచురల్ షుగర్స్ సులభంగా రక్త ప్రవాహంలోకి కలిసిపోతాయి. ఇతర ఆహారపదార్థాలతో పోల్చుకుంటే రక్తంలో చక్కెరస్థాయిలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.

పుచ్చకాయ తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుందా?
పుచ్చకాయలో ఉండే గైసిమిక్ ఇండెక్స్(GI) మాత్రమే కాకుండా, 90 శాతానికి పైగా వాటర్ కంటెంట్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి.

గ్లైసిమిక్ లోడ్ అనేది కార్బోహైడ్రేట్స్ నాణ్యతను, పరిమాణాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఎందుకంటే పుచ్చకాయలో గ్లైసిమిక్ లోడ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని మితంగా తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్తాయిలపై ప్రభావం తక్కువగా ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే, పుచ్చకాయను మితంగా తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలపై ఎలాంటి ప్రభావం ఉండదు. పుచ్చకాయతో పాటు ప్రోటీన్ లేదా హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుకోవచ్చు.


డయాబెటిస్‌తో బాధపడే వారు పుచ్చకాయ తినడం మంచిదేనా?

డయాబెటిస్‌తో బాధపడేవారు వారి డైట్‌లో పుచ్చకాయను చేర్చుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో పోషకాలు సమృద్దిగా ఉంటాయి.

  • విటమిన్ సి, విటమిన్ ఎ
  • లైకోపిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్
  • హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు వాటర్ కంటెంట్ పుచ్చకాయలో సమృద్దిగా ఉంటాయి.

పుచ్చకాయ తినడం ద్వారా లభించే ఈ పోషకాల వలన గుండె ఆరోగ్యం మెరుగవుతుంది, హైడ్రేటెడ్‌గా ఉంటారు. డయాబెటిస్‌తో బాధపడేవారికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే వీటిని మితంగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువ మోతాదులో పుచ్చకాయలు తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగవచ్చు. ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ ఉండే ఫుడ్‌తో కలిపి తినడం మంచిది.

పుచ్చకాయ తినే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

  • ఖాళీ కడుపుతో పుచ్చకాయలను తినకపోవడం మంచిది.
  • రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచేందుకు ప్రోటీన్, ఫైబర్ ఫుడ్‌తో పాటు తీసుకోవడం మంచిది.
  • పుచ్చకాయ తిన్న తర్వాత బ్లడ్ షుగర్ లెవల్స్ మానిటర్ చేసుకోవాలి.
  • పుచ్చకాయను మితంగా తినడం మంచిది.
  • పుచ్చకాయ జ్యూస్ కంటే, నేరుగా పుచ్చకాయనే తినడం మంచిది.

బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో లేనివారు పుచ్చకాయలను వైద్యుల పర్యవేక్షణ మేరకు మాత్రమే తినడం మంచిది.
Disclaimer:
పైన తెలిపిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే....పాటించేముందు సంబంధిత నిపుణుల సలహా పాటించడం తప్పనిసరి!

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu