Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యాప్‌స్టోర్ నుండి ఓలా,ఉబర్,ర్యాపిడో యాప్స్ తొలగించండి...యాపిల్,గూగుల్‌కు ఆ రాష్ట్రం నోటీసులు

యాప్‌స్టోర్ నుండి ఓలా,ఉబర్,ర్యాపిడో యాప్స్ తొలగించండి...యాపిల్,గూగుల్‌కు ఆ రాష్ట్రం నోటీసులు

Times Now Telugu 1 week ago

యాప్ స్టోర్ నుండి ఓలా,ఉబర్, ర్యాపిడో యాప్స్ తొలగించాలంటూ మహారాష్ట్ర స్టేట్ సైబర్ డిపార్ట్‌మెంట్ యాపిల్, గూగుల్‌కు నోటీసులు జారీ చేసింది. మహారాష్ట్రలో అక్రమ బైక్ ట్యాక్సీ కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకుంది.

బైక్ టాక్సీ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న ఓలా,ఉబర్, ర్యాపిడో వంటి అగ్రిగేటర్ బేస్డ్ టూవీలర్ టాక్స్ సర్వీసెస్‌పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు మహారాష్ట్ర సైబర్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం మే 15వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 79(3)(బి)ని పేర్కొంటూ, ఆపిల్ యాప్ స్టోర్ , గూగుల్ ప్లే స్టోర్ నుండి అప్లికేషన్‌లను యాప్ స్టోర్ నుండి తొలగించాలని ఆదేశించింది. రాష్ట్రంలో నడుపుతున్న బైక్ టాక్స్‌ప్లాట్‌ఫామ్స్‌పై చర్యలు తీసుకోవాలంటూ రవాణా శాఖా మంత్రి ప్రతాప్ సర్నాయక్, మహారాష్ట్ర సైబర్ డిపార్ట్‌మెంట్‌కు మే 12న లేఖ రాసిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి అప్లికేషన్స్ ద్వారా నడుస్తున్న బైక్ ట్యాక్సీ సేవలు చట్టవిరుద్ధమైనవని , ప్రస్తుత లీగల్,రెగ్యులేటరీకి విరుద్ధమని" ఆపిల్ , గూగుల్‌కు పంపిన నోటీసులలో మహారాష్ట్ర సైబర్ సెల్ పేర్కొంది.

ఈ ప్లాట్‌ఫారమ్స్ అనుమతులు, ప్రభుత్వ ఆమోదాలు పొందకుండా, రవాణా శాఖ నిర్దేశించిన నియమ నిబంధనలు , మోటార్ వాహనాల చట్టంలోని నిబంధనలను పాటించకుండా ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ నడుపుతున్నాయని ఆ నోటీసులలో పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత విషయంలో ఆందోళనను గురించి నోటీసుల్లో పేర్కొన్నారు. డ్రైవర్ వెరిఫికేషన్ మెకానిజం, ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్, ఉమెన్ సేఫ్టీ మెకానిజం అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్సెస్ సిస్టమ్స్ సరైన విధంగా పనిచేయడం లేదని పేర్కొన్నారు.

అనధికారిక బైక్ టాక్సీ సర్వీసెస్‌పై మాత్రమే చర్యలు ...
మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కేవలం అనధికారిక బైక్ టాక్సీ సర్వీసెస్‌పై మాత్రమే ఉంటాయని, ఓలా, ఉబర్, ర్యాపీడో సేవలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. అయితే ఈ విషయంపై ప్రస్తుతానికి ఓలా, ఉబర్, ర్యాపిడా స్పందించలేదు.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ అడం్ పబ్లిక్ రిలేషన్స్ (DGIPR), మహారాష్ట్ర ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో.... ఓలా, ఉబర్, ర్యాపిడో సేవలు పూర్తిగా నిలిపోతాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న సమాచారంలో వాస్తవం లేదని పేర్కొంది. అనధికారిక బైక్ టాక్సీ సర్వీసెస్‌పై మాత్రమే చర్యలు ఉంటాయని తెలిపింది.

మహారాష్ట్రలో నడుస్తున్న అనధికారిక బైక్ టాక్సీ సర్వీసెస్‌పై రవాణా శాఖ చర్యలు తీసుకుంటుందని వెల్లడించింది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కు లేఖరాశారు. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి అనధికారిక బైక్ ట్యాక్సీ సర్వీసెస్‌పై FIR నమోదు చేయాలని డిమాండ్ చేసినట్లు పోస్టులో పేర్కొన్నారు. అదే సమయంలో రవాణాశాఖ కమిషనర్ కూడా సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కు ఈ విషయంపై లేఖ రాసినట్లు తెలిపారు. మహారాష్ట్రలో గతంలో కూడా టూ వీలర్ ట్యాక్సీ సర్వీసెస్ అందించే యాప్ బేస్డ్ మొబిలిటీ ప్లాట్‌ఫామ్స్ కూడా చట్టపరమైన, సమస్యలు ఎదుర్కొన్నాయి.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu