Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూపీలో వరుణుడు బీభత్సం... ఒక్కరాత్రిలో 89 మంది దుర్మరణం

యూపీలో వరుణుడు బీభత్సం... ఒక్కరాత్రిలో 89 మంది దుర్మరణం

Times Now Telugu 1 week ago

దేశమంతా మండుటెండలతో అల్లాడిపోతుంది. భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌లో మాత్రం విభిన్న వాతావరణం నెలకొంది.

ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, భారీ వర్షానికి ఒక్కరాత్రిలో ఏకంగా 89 మందికిపైగా మరణించారు.క్యుములోనింబస్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం రాత్రి వర్షంకురిసింది. ఒకవైపు వడగళ్ల వాన మరోవైపు భారీగా ఈదురుగాలులు, ఇంకోవైపు పిడుగులతో వాతావరణం అతలాకుతలం అయ్యింది.

భారీ వర్షంతో 89 మంది మృతి
మే 13న రాత్రి కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా 89 మంది మృతి చెందారు. అలాగే 53 మందికిపైగా గాయపడ్డారు. 114 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. 87 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ విషయాన్ని యూపీ రిలీఫ్ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. ఈ అకాల వర్షాల వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వర్షం, ఈదురుగాలుల బీభత్సం ప్రభావం అత్యధికంగా ఉన్న ప్రాంతాలలో ముమ్మర సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు యూపీ రిలీఫ్ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది.

ప్రయాగ్‌రాజ్‌లో అత్యధికంగా21 మంది మృతి

భారీ వర్షంనిన్న సాయంత్రం సంభవించిన పెను తుపాను తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భారీ వర్షం, ధూళి, బలమైన ఈదురు గాలులతో కూడిన ఈ విలయానికి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మృతుల సంఖ్య 54కి చేరింది. ఈ ప్రకృతి ప్రకోపానికి వందలాది చెట్లు నేలకూలాయి, ఇళ్లు దెబ్బతిన్నాయి, విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ భారీ వర్షం, ఈదురు గాలుల ప్రభావం ప్రయాగ్‌రాజ్, భదోహి, సోన్‌భద్ర, ఫతేపుర్‌ జిల్లాలలో బుధవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఇక మృతుల విషయానికి వస్తే అధికారిక లెక్కల ప్రకారం ప్రయాగ్‌రాజ్‌లో అత్యధికంగా 21 మంది మరణించారు. భదోహీలో 16మంది, మీర్జాపూర్‌లో 10 మంది, ఫతేపూర్‌లో 11 మంది,సంత్ రవిదాస్ నగర్‌లో 14, హర్దోయిలో ఇద్దరు, కాన్పూర్ దేహత్, కౌశాంబి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ప్రయాగ్‌రాజ్‌లోని హండియా, ఫూల్‌పూర్, సోరావ్, మేజా ప్రాంతాల్లో నష్టం తీవ్రంగా ఉంది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu