Thursday, 05 Aug, 8.43 am తొలి వెలుగు

హోమ్
ధనిక రాష్ట్రమా.. ఇంత దౌర్భాగ్యమా!

నిక రాష్ట్రంలో మరో దౌర్భాగ్య పరిస్థితి. బంగారు తెలంగాణకు ఇంకో అపకీర్తి. కేసీఆర్ అండ్ కో పాలనలో ప్రజల బతుకులకు ఎంత గ్యారంటీ ఉందో చెప్పే సాక్ష్యమిది. ప్రతి నియోజకవర్గానికి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలను అందిస్తానని చెప్పి కుర్చి ఎక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కనీసం ఉన్న ఆస్పత్రులకు వెళ్లే సౌకర్యాన్ని కూడా వారికి అందించలేని దుస్థితిలో ఉన్నారు. తెలంగాణలో ప్రభుత్వ అంబులెన్స్ ల సంఖ్య ఎంతో ఉందో తెలిస్తే మూర్ఛపోవాల్సిందేనేమో.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాల ప్రకారం ప్రతి లక్ష జనాభాకు తప్పనిసరిగా ఒక అంబులెన్స్ ఉండాలి. కానీ తెలంగాణలో పరిస్థితులు దారుణంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం, రాష్ట్రంలో కేవలం 632 అంబులెన్సులు మాత్రమే ఉన్నాయి. అది కూడా 108 అలాగే 102 వాహనాలు కలిపి. తెలంగాణ జనాభా దాదాపు 4 కోట్లకు దగ్గరగా ఉంది. ఆ లెక్కన 4 వేలకు అటూ ఇటూగా ఉండాలి. కానీ అందులో 20 శాతం కూడా లేకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది.

సొసైటీ ఫర్ సేఫ్టీ ఆఫ్ పబ్లిక్ అండ్ గుడ్ గవర్నెన్స్ (Society for Safety of Public and Good Governance) ఆర్టీఐ సాయంతో ఈ వివరాలను సంపాదించింది. అంబులెన్సుల కొరత కారణంగా.. ఉన్న డ్రైవర్లే రెండు, మూడు షిఫ్టులలో పనిచేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయని ఆరోగ్య శాఖలోనే పనిచేస్తున్న కొందరు అధికారులు చెప్తున్నారు. కరోనా మహమ్మారి తరువాత, అంబులెన్స్‌ల ఆవశ్యకత ఎంతో పెరిగింది. కానీ ప్రభుత్వానికి అదిపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ప్రస్తుతమున్న 632లో 299 అంబులెన్సులు 102కు సంబంధించినవే. అంటే ఇవి గర్భిణీ స్త్రీలకు ప్రసవానికి ముందు.. ప్రసవానంతర వైద్య సంరక్షణ కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసినవే కావడం గమనార్హం. ఇక మిగిలిన వాటిలో కొన్ని అంబులెన్స్‌లలో అయితే కనీస సౌకర్యాలు కూడా లేవు. మరో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. అంబులెన్సుల వేగం నియంత్రణలో ఉండేలా ఏర్పాటు చేయడంతో చాలా సమయాల్లో ఇవి సమయానికి ఆసుపత్రికి చేరలేకపోతున్నాయన్న వాదనలు ఉన్నాయి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Toli Velugu Telugu
Top