Saturday, 28 Mar, 6.18 pm టాలీవుడ్.net

న్యూస్
నెలకు వెయ్యిరోజులని ఇప్పుడే తెలిసింది!

Ram Gopal Varma funny tweet about Corona

ప్రపంచాన్ని కరోనా వణికిస్తుంటే దాంతో రామ్‌గోపాల్‌వర్మ కాలక్షేపం చేస్తున్నారు. ఎప్పుడూ ఏదో ఒక పోస్టుతో సోషల్ మీడియా వేదికగా రచ్చ చేసే వర్మ ఈ మధ్య కరోనా మహమ్మారిపై వరుస ట్వీట్‌లు చేస్తున్నారు. జనం అంతా భయంతో వణికిపోతే ఇష్యూ సీరియస్ అని ఇంటకే పరిమితమైపోతుంటే రామ్‌గోపాల్‌వర్మ మాత్రం కరోనాతో కామెడీ చేస్తున్నారు.

ఇప్పటికే కరోనా కారణంగా ఇటలీ, స్పెయిన్‌, అమెరికా అల్లాడిపోతోంది. ఇప్పుడిప్పుడే దీని తాకిడి ఇండియాని తాకింది. ప్రస్తుతం దీని నుంచి తప్పించుకోవాలంటే సోషల్ డిస్టెన్సీని మెయింటైన్ చేయాలని 21 రోజుల పాటు ఇంటి పట్టునే వుండాలని భారత ప్రభుత్వం లాక్ డౌన్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సామాన్యులు, సెలబ్రిటీలు అంతా ఇంటికే పరిమితమైపోయారు.

వర్మ మాత్రం ఈ పిరియడ్‌ని తట్టుకోలేకపోతున్నారట. రోజులు గడవడం లేదని, బోర్‌గా వుందని ట్విట్టర్‌లో పోస్ట్ లు పెడుతున్నారు. ఇంట్లో ఖాలీగా కూర్చోవడంతో వర్మకు ఏమీ తోచడం లేదట. నెలకు 30 రోజులు వుంటాయని ఎప్పుడూ అనుకునేవాడిని. కానీ నెలకు వెయ్యి రోజులు వుంటాయని మొదటి సారి తెలిసింది. సమయం ముందుకు సాగడం లేదు. కరోనా భయంతో సమయంతో సహా అన్నింటినీ ఆపేశారు. ఇప్పుడు ఏమి చేయాలి కరోనా` అంటున్నాడు వర్మ నిజమే మరి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Tollywood.Net Telugu
Top