Thursday, 13 Aug, 10.41 am టాలీవుడ్.net

టాప్ స్టోరీస్
`Rx 100` దర్శకుడికి ఏమైంది?

`Rx 100` చిత్రంతో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు అజయ్ భూపతి. తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆయన తన తదుపరి చిత్రం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. `మహా సముద్రం` పేరుతో అజయ్ భూపతి ఓ భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని రూపొందించాలని ప్లాన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇటీల వరుస కథనాలు వినిపించాయి. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రబలుతుండటంతో ప్రస్తుత పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్న తరువాత ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకురావాలని సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఇదిలా వుంటే ఇటీవల టాలీవుడ్ సెలబ్రిటీలకు కరోనా భయం పట్టుకుంది. వరుసగా ఒకరి వెంట ఒకరు కరోనా బారిన పడుతున్నారు. బండ్ల గణేష్ ఆ తరువాత రాజమౌళి కుటుంబం.. దర్శకుడు తేజ కరోనా బారిన పడ్డారు. ఇటీవల బండ్ల గణేష్ కరోనా బారి నుంచి తేరుకోగా.. తాజాగా రాజమౌళి కుటుంబం కరోనాని జయించి త్వరలో ప్లాస్మా దానం చేయడానికి సిద్ధమవుతుండగా దర్శకుడు అజయ్ భూపతికి కరోనా వైరస్ సోకినట్టు తెలిసింది.

ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వచ్చేసింది.. త్వరలో వస్తా.. ప్లాస్మా ఇస్తా..` అని అజయ్ భూపతి ట్వీట్ చేశారు. అజయ్ భూపతి తెరకెక్కించనున్న మల్టీస్టారర్ చిత్రం `మహా సముద్రం`లో శర్వానంద్‌, సిద్ధార్ధ్ హీరోలుగా నటించనున్నారు. హీరోయిన్‌గా సాయి పల్లవి నటించనున్నట్టు తెలిసింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Tollywood.Net Telugu
Top