Friday, 27 Nov, 11.30 am T2B Live

న్యూస్
5 ఏళ్ల తర్వాత కన్నడ డబ్.సెన్సేషనల్ TRP సాధించిన బాహుబలి!

5 ఏళ్ల క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యంత భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి అన్ని ఇండస్ట్రీ లలో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని అప్పటి వరకు తెలుగు సినిమాల మార్కెట్ అంటే కేవలం తెలుగు రాష్ట్రాలే అనుకున్న వాళ్లకి షాక్ ఇస్తూ ఆల్ ఇండియా లెవల్ లో హైయెస్ట్ షేర్ ని వసూల్ చేసిన సినిమా గా చరిత్ర సృష్టించిన ఎపిక్ ఆల్ టైం విజువల్ వండర్ బాహుబలి సినిమా.

రిలీజ్ అయిన 5 ఏళ్ల తర్వాత రీసెంట్ గా కన్నడ లో డబ్ అయింది, అప్పటికే తెలుగు లో అనేక సార్లు చూసిన ఈ సినిమా మొదటి సారి కన్నడ లో డబ్ అవ్వడం తో భారీగా టెలివిజన్ లో ఎగబడి చూడగా అక్కడ తెలుగు సినిమాల పరంగా డబ్ అయిన మూవీస్ లో.

వన్ ఆఫ్ ది హైయెస్ట్ రేటింగ్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది, అక్కడ బాహుబలి సినిమాకి ఫస్ట్ టైం డబ్ టెలికాస్ట్ కి 6.3 రేటింగ్ దక్కగా ఓవరాల్ గా ఆల్ టైం టాప్ 4 ప్లేస్ ని అక్కడ సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది ఈ సినిమా..

ఒకసారి టాప్ లిస్టును గమనిస్తే.. 👉#SarileruNeekevvaru: 6.5 TRP
👉#Syeraa : 6.3
👉#Sarrainodu: 6.3
👉#Baahubali 1: 6.3*****
👉#Rangsthalam: 6
👉#GeethaGovindam: 5.6
👉#AlaVaikunthaPurramuloo: 5.34
👉#DearComrade - 5.03 TRP
👉#AAa: 4.41
👉#SonOfSathyamurthi: 4.22
సినిమా టెలికాస్ట్ టైం లో మరో ఛానెల్ లో నాని ఈగ సినిమా కూడా టెలికాస్ట్ అవ్వడం ఆ సినిమా 2.7 రేటింగ్ ని సొంతం చేసుకోవడం జరిగింది. కొంచం టైం వేరుగా రెండు సినిమాలను ప్లాన్ చేసి ఉంటె.

కచ్చితంగా బాహుబలి కి మరింత ఎక్కువ రేటింగ్ దక్కి ఉండేది, అదే టైం లో ఈగ కూడా మరింత బెటర్ TRPని సొంతం చేసుకుని ఉండేది, మొత్తం మీద కాంపిటీషన్ లో కూడా 5 ఏళ్ల రిలీజ్ తర్వాత కూడా టాప్ 4 రేటింగ్ తో దుమ్ము లేపింది బాహుబలి సినిమా..

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Tollywood2bollywood.com
Top