Sunday, 19 Sep, 12.35 pm TS MIRCHI

హోమ్
దసరా స్పెషల్ : ఒకే ఫ్రేములో.. తారక్-మహేష్-చరణ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగితే ఎట్టుట్టదో తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1కి తారక్ హోస్ట్ గా వ్యవహరించారు తనదైన టైమింగ్ తో షోని ఓ రేంజ్ కి తీసుకెళ్లాడు. ఇక ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమంలోనూ తనదైన మార్క్ చాటుతున్నారు. వారానికో సప్రైజ్ ఇస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ ని తీసుకొచ్చాడు.

సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో రాజమౌళి, కొరటాల శివ సైతం తమ ఆటతో మెప్పించనున్నారు. కాగా..దసరా కానుకగా ప్రసారం కానున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమంలో మహేశ్‌బాబు స్పెషల్‌గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ షోలో పాల్గొనేందుకు మహేశ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని.. త్వరలోనే ఈ ఎపిసోడ్‌ షూట్‌ జరగనుందని సమాచారం.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: TS Mirchi
Top