Monday, 23 Nov, 1.35 pm TS MIRCHI

హోమ్
మోనాల్ కంటే లాస్య'కు తక్కువ ఓట్లు వచ్చాయా ?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 పదకొండు వారాలని పూర్తి చేసుకుంది. పదకొండో వారం లాస్య ఎలిమినేట్ అయ్యారు. లాస్య టాప్-5లో ఉంటారని బిగ్ బాస్ అభిమానులు అంచనా వేశారు. అయితే అంచనాలు తలక్రిందులయ్యాయ్. వాస్తవానికి ఈ వారం మోనాల్ ఎలిమినేట్ అవుతుందని అందరు భావించారు. కొన్ని వారాలుగా ఆమెని బిగ్ బాస్ కాపాడుకుంటూ వస్తున్నారు.

మోనాల్ కోసం ఇతర సభ్యులని బలి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కుమార్ సాయి, దివి, మెహబూబ్.. మోనాల్ కోసం బలయ్యారనే ప్రచారం జరుగుతోంది. మోనాల్ ని పంపిస్తే.. ఇంట్లో గ్లామర్ మిస్ అవుతుందనే కారణంతోనే ఆమెని సేవ్ చేస్తున్నారనే విమర్శలున్నాయ్. లాస్య ఎలిమినేట్ కావడంతో.. ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్టయింది.

లాస్య తెలుగమ్మాయ్. బుల్లితెరపై టాప్ యాంకర్ గా ఓ వెలుగు వెలిగారు. ఆమెకి ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి లాస్యకు మోనాల్ కంటే తక్కువ ఓట్లు రావడం ఏంటీ ? అని ప్రశ్నిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే ? అభిజిత్, అరియానా కంటే ముందే మోనాల్ సేవ్ అయినట్టు ప్రకటించాడు నాగ్. మొత్తానికి.. లాస్య ఎలిమినేట్ కావడాన్ని ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: TS Mirchi
Top