హోమ్
పంతం నెగ్గించుకున్న విక్రమ్ గౌడ్
తెలంగాణ కాంగ్రెస్ నేతలు బీజేపీలో క్యూ కడుతున్న సంగతి తెలిసింది. ఉన్నవారు పార్టీకి పలు కండిషన్స్ పెడుతున్నారు. వాటిని తీర్చకుంటే పార్టీని వీడతామని బెదిరిస్తున్నారు. దివంగత మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది.
గ్రేటర్ ఎన్నికల్లో తన వర్గం నేతలకి టికెట్లు ఇవ్వకపోతే పార్టీని వీడతానని విక్రమ్ గౌడ్ ఆల్టీమేటం జారీ చేశారు. కనీసం తన వర్గానికి చెందిన ఐదుగురికి టెకెట్లు ఇవ్వాలని కోరారు. ఫైనల్ గా విక్రమ్ గౌడ్ డిమాండ్లని తీర్చేందుకే కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపింది. ఆయన కోరిన వారికి టికెట్లు ఇచ్చింది. దీంతో విక్రమ్ గౌడ్ సంతృప్తి చెందారని తెలుస్తోంది.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: TS Mirchi
related stories
-
తాజావార్తలు ధోనీ క్రికెట్ అకాడమీ ప్రారంభం
-
హోమ్ బాలుగారికి పద్మవిభూషన్ ఇంకా ఎవరికి అవార్డులో చూడండి
-
ఛాయాచిత్రాల ప్రదర్శన Republic Day 2021: జనసేన పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన జనసేనాని పవన్...