Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
13 ఏళ్ల క్రితమే సీఎంగా ఫిక్సైన నటుడు!

13 ఏళ్ల క్రితమే సీఎంగా ఫిక్సైన నటుడు!

Tupaki.com 1 week ago

ళపతి విజయ్ తమిళనాడు రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన గురించి భారతీయ పరిశ్రమ మాట్లాడుకుంటోన్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా కోలీవుడ్ లో ఇది నిరంతరం చర్చగా మారింది. విజయ్ వ్యక్తిత్వం - నాయకత్వ లక్షణాలపై చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. తాజాగా నటుడు తోట రాయ్ చౌదరి విజయ్‌తో కలిసి నటించిన `కత్తి` సినిమా షూటింగ్ రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలోనే విజయ్‌లో గొప్ప నాయకుడు కనిపించాడని ఆయన భవిష్యత్తులో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని తాను అప్పుడే ఊహించానని చౌదరి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

`కత్తి` సినిమాలో విలన్ పాత్రలో నటించిన తోట రాయ్ చౌదరి విజయ్‌తో గడిపిన సమయం తనపై ఎంతటి ప్రభావం చూపిందో వివరించారు. సెట్స్‌లో విజయ్ ఎంతో నిశ్శబ్దంగా ఉండేవారన్నారు. కానీ తన పని పట్ల ఆయనకు ఉన్న ఏకాగ్రత , క్రమశిక్షణ అమోఘమని ప్రశంసించారు. షూటింగ్ గ్యాప్‌లో రాజకీయాల గురించి లేదా సామాజిక సమస్యల గురించి చర్చ వచ్చినప్పుడు విజయ్ ఇచ్చే సమాధానాలు ఎంతో పరిణతితో కూడి ఉండేవన్నారు. అవి ఒక నటుడి ఆలోచనల్లా కాకుండా ప్రజా నాయకుడి అంతరంగాన్ని ప్రతిబింబించేలా ఉండేవని గుర్తుచేసుకున్నారు.

విజయ్ తన అభిమానులతో - తోటి నటులతో వ్యవహరించే తీరు ఎంతో హుందాగా ఉంటుందన్నారు.

`విజయ్ ఎప్పుడూ తన స్టార్‌డమ్‌ను తలకు ఎక్కించుకోలేదు. షూటింగ్ సమయంలో ప్రతి ఒక్కరినీ సమానంగా గౌరవించేవారు. ఆయనలో ఉన్న ఆ నిరాడంబరత్వమే ఆయనను మిగిలిన వారికంటే భిన్నంగా నిలబెట్టింది` అని కొనియాడారు. 2013లోనే విజయ్‌కున్న ప్రజాదరణ చూసి ఆయన రాజకీయాల్లోకి వస్తే తిరుగులేని నాయకుడిగా ఎదుగుతారని అప్పుడే తాను అనుకున్నట్లు వెల్లడించారు. తమిళనాడు రాజకీయాల్లో సినిమా తారలకు ఉన్న ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ.. `ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజాల వారసత్వాన్ని పుణికిపుచ్చుకోగల సత్తా విజయ్‌కు ఉందని తోట రాయ్ చౌదరి అభిప్రాయపడ్డారు.

విజయ్ సినిమాల ద్వారానే కాకుండా తన సేవా సంస్థల ద్వారా సామాన్య ప్రజలకు చేరువయ్యారన్నారు. దీనికి సంబంధించిన అసలైన బీజం 2009లోనే పడిందన్నారు. అప్పటి నుంచి విజయ్ రాజకీయాలను నిశితంగా పరిశీ లిస్తున్నారని, తన అభిమాన సంఘాల ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు అప్పటి నుంచే చేసారన్నారు. అదే ఆయన రాజకీయ ప్రయాణానికి పునాదిగా మారిందని విశ్లేషించారు. విజయ్ ముఖ్యమంత్రి కావాలని కోట్లాది మంది ప్రజలు కోరుకున్నారని, ఆ కల ఇప్పుడు నిజమవ్వడంతో చౌదరి ఆనందంతో ఉబ్బితబ్బిబారు. ప్రస్తుతం విజయ్ చివరి చిత్రం `జన నాయగన్` లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలలో జాప్యం జరుగుతోన్న నేపథ్యంలో విజయ్ సీఎం అవ్వడంతో? ఇకపై ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొస్తుందని అభిమానులు ఆశీస్తున్నారు. త్వరలోనే రిలీజ్ తేదీపై క్లారిటీ వస్తుందని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu