Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన క్రీడాకారిణి..మదర్ హార్ట్‌కు హ్యాట్సాఫ్!

60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన క్రీడాకారిణి..మదర్ హార్ట్‌కు హ్యాట్సాఫ్!

Tupaki.com 1 week ago

బ్యాడ్మింటన్ కోర్టులో రాకెట్‌తో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసిన గుత్తా జ్వాల, ఇప్పుడు ఒక తల్లిగా అమృతం లాంటి తన చనుబాలను దానం చేస్తూ ఎందరో పసిపాపల ప్రాణాలు కాపాడుతోంది.

క్రీడాకారిణిగా ఎన్నో మెడల్స్ గెలిచిన ఆమె, ఈ సేవా యజ్ఞంతో కోట్లాది మంది మనసులను గెలుచుకుంటోంది. ఏకంగా 60 లీటర్ల తల్లిపాలను దానం చేసి రికార్డు సృష్టించిన జ్వాల ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఆ విశేషాలు మీకోసం.

కోర్టులో షాట్లు.. జీవితంలో ప్రాణాలు:

బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల అంటే మనందరికీ తెలుసు. కోర్టులో ఆమె వేసే షాట్లు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాయి. కానీ, ఇప్పుడు ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఒక గొప్ప పోరాటం చేస్తోంది. ఇది మెడల్ గెలిచే పోటీ కాదు, అభాగ్యులైన పసిపాపల ప్రాణాలను కాపాడే పోరాటం. ఇక ఒక తల్లిగా తను చేస్తున్న సేవ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

60 లీటర్ల అమృతం:

గుత్తా జ్వాల బిడ్డకు జన్మనిచ్చిన తొలి ఏడాదిలో ఏకంగా 60 లీటర్ల తల్లిపాలను దానం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక తన బిడ్డకు పాలు తాగించిన తర్వాత మిగిలిన పాలను వృధా చేయకుండా, ప్రభుత్వ ఆసుపత్రుల్లోని శిశువుల కోసం పంపుతోంది. డెలివరీ అయిన మొదటి ఆరు నెలల్లోనే 30 లీటర్లు దానం చేసిన ఆమె, ప్రస్తుతం రోజుకు 600 ml పాలను సేకరించి పంపిస్తోంది.

పసిపాపలకు ప్రాణదానం:

చాలామంది తల్లులు అనారోగ్యం కారణంగా లేదా ప్రసవ సమయంలో వచ్చే సమస్యల వల్ల తమ బిడ్డలకు పాలివ్వలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి సమయంలో తల్లి పాలు దొరక్క ఇబ్బంది పడే చిన్నారి ప్రాణాలకు జ్వాల పంపే పాలు అమృతంలా మారుతున్నాయి. "అనారోగ్యంతో పుట్టే పిల్లలకు మనం ఇచ్చే 100 ml పాలు కూడా కొన్ని రోజుల పాటు వారిని కాపాడతాయి" అని జ్వాల చెబుతున్న మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.

ముందుకు రావాలని పిలుపు:

కేవలం తాను దానం చేయడమే కాకుండా, పాలు ఇవ్వగలిగే స్థితిలో ఉన్న ఇతర తల్లులు కూడా ముందుకు రావాలని జ్వాల కోరుతోంది. బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేయడం వల్ల ఎంతోమంది చిన్నారులు ఆరోగ్యంగా పెరుగుతారని, దీని కోసం దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాలని ఆమె సూచిస్తోంది. ఇక ఆమె పిలుపుతో సోషల్ మీడియాలో నెటిజన్లు జ్వాలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వ్యక్తిగత జీవితం:

2021లో నటుడు విష్ణు విశాల్‌ను పెళ్లాడిన గుత్తా జ్వాల, సరిగ్గా పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత అదే రోజున ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఒక పక్కన తన బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకుంటూనే, మరో పక్కన తల్లి లేని పిల్లల ఆకలి తీరుస్తూ తనలోని గొప్ప మానవత్వాన్ని చాటుకుంటోంది.

క్రీడాకారిణిగా దేశానికి పేరు తెచ్చిన జ్వాల, ఇప్పుడు ఒక తల్లిగా సమాజానికి దిక్సూచిలా నిలుస్తోంది. 60 లీటర్ల తల్లిపాలు దానం చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. తన మంచి మనసుతో పసిపాపలకు పునర్జన్మ ప్రసాదిస్తున్న ఈ 'మదర్ ఆఫ్ బ్యాడ్మింటన్'కు మనందరి తరపున ఒక సెల్యూట్ చేయాల్సిందే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu