Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ 17 చిత్రాలకు ఛాన్స్ ఇస్తే.. మిగతా వాళ్ళు ఊరుకుంటారా?

ఆ 17 చిత్రాలకు ఛాన్స్ ఇస్తే.. మిగతా వాళ్ళు ఊరుకుంటారా?

Tupaki.com 3 days ago

టాలీవుడ్‌ లో థియేటర్ల రెంటల్ వ్యవస్థ, ఎగ్జిబిటర్ల షరతులు, నిర్మాతల ఒత్తిళ్లు కొన్నిరోజులుగా హాట్ టాపిక్‌ గా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భారీ సినిమాలకు ప్రత్యేక సడలింపులు ఇవ్వడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది.

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న పెద్ది సినిమాకు కొన్ని విషయంలో మినహాయింపులు ఇచ్చారనే ప్రచారం సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. అదే ఇప్పుడు ఇతర నిర్మాతల్లో కొత్త డిమాండ్లకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలయ్యే సమయంలో థియేటర్లలో రెంట్లు, షేర్లు, స్పెషల్ షోలు, టికెట్ రేట్లు వంటి అంశాలపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య చర్చలు జరుగుతుంటాయి. అయితే ఒక సినిమాకు ప్రత్యేకంగా మినహాయింపులు ఇస్తే, అదే సదుపాయాలు తమకు కూడా కావాలని మిగతా నిర్మాతలు అడగడం సహజమేనని టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న 17 సినిమాలకు ఎగ్జెంప్షన్ ఇవ్వాలని కోరుతున్న అంశమే ఎక్కువగా చర్చలోకి వచ్చింది.

పెద్ద బడ్జెట్ సినిమాలు కాబట్టి వాటికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి అని కొందరు చెబుతుండగా, చిన్న, మీడియం రేంజ్ సినిమాల నిర్మాతలు మాత్రం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఒకరికే ప్రత్యేక రూల్స్ ఉంటే మిగతావాళ్లు ఎందుకు ఫాలో అవ్వాలనే ప్రశ్నలు వినిపిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు పూర్తిగా కన్విన్స్ కాలేదని తెలుస్తోంది.

ఇప్పటికే థియేటర్ నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయి. విద్యుత్ ఛార్జీలు, మెయింటెనెన్స్, స్టాఫ్ ఖర్చు భారీగా పెరుగుతున్న సమయంలో నిర్మాతల ఒత్తిడికి లోనై మరిన్ని సడలింపులు ఇవ్వడం తమకు కష్టమని కొందరు ఎగ్జిబిటర్లు అభిప్రాయపడుతున్నారట. ఒక సినిమాకు ఇచ్చిన మినహాయింపులు తర్వాత అందరికీ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే థియేటర్ వ్యవస్థపై మరింత ప్రభావం పడుతుందని వారు భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇంకా మరోవైపు నిర్మాతల వాదన కూడా గట్టిగానే ఉంది. భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న సినిమాలకు రికవరీ చాలా కీలకం. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలయ్యే చిత్రాలకు మొదటి వారమే అత్యంత ముఖ్యమని, అందుకే కొన్ని ప్రత్యేక సడలింపులు అవసరమని వారు చెబుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు భారీ రిలీజ్ ప్లానింగ్ ఉండటంతో ఎగ్జిబిటర్లు కూడా సహకరించాలని కోరుతున్నారట.

అయితే మొత్తం వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌ లో కొత్త చర్చకు దారితీసింది. ఒకసారి ప్రత్యేక మినహాయింపు ట్రెండ్ మొదలైతే తర్వాత ప్రతి పెద్ద సినిమా అదే డిమాండ్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. దీంతో ఫ్యూచర్ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య మరిన్ని చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పెద్ది చుట్టూ మొదలైన ఆ చర్చ రాబోయే రోజుల్లో టాలీవుడ్ రిలీజ్ వ్యవస్థపై పెద్ద ప్రభావం చూపుతుందా? లేక త్వరలో అందరూ ఒక నిర్ణయానికి వస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. మరేం జరుగుతుందో అంతా వేచి చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu