Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ స్టార్ హీరో కోసం భారీ కటౌట్ నే దించారే!

ఆ స్టార్ హీరో కోసం భారీ కటౌట్ నే దించారే!

Tupaki.com 1 week ago

షారుఖ్ ఖాన్ - సుహానా ఖాన్- దీపికా పదుకొణే ప్రధాన పాత్రల్లో మోస్ట్ అవేటెడ్ మూవీ గా సిద్దార్ధ్ ఆనంద్ దర్శక త్వంలో `కింగ్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ నటిస్తున్నట్లు ప్చారం జరుగుతోంది. కానీ అతడు నిజంగా నటిస్తున్నాడా? లేదా? అన్నది అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. దీంతో అభిషేక్ ఎంట్రీ విషయంలో ఇప్పటివరకూ సరైన క్లారిటీ లేకుండానే ఉంది. ఈ నేపథ్యంలో సినిమా సెట్స్ నుండి కీలకమైన ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ లీక్డ్ పిక్ లో బాలీవుడ్ అభిషేక్ బచ్చన్ ది కావడం సంచలనంగా మారింది.

దీంతో ఇప్పుడీ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజా లీక్‌తో అభిషేక్ ఎంట్రీ దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది . ఇందులో అభిషేక్ బచ్చన్ విలన్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. లీక్ అయిన ఫోటోలో ఆయన ఆహార్యం, గడ్డం , సీరియస్ లుక్ చూస్తుంటే? షారుఖ్ ఖాన్‌కు ధీటైన పాత్రలో నటిస్తు న్నట్లు తెలుస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత షారుఖ్ - అభిషేక్ ఒకే స్క్రీన్‌పై కనిపించ బోతుండటంతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. గతంలో ఇద్దరు `కభీ అల్విదా నా కెహనా`, `హ్యాపీ న్యూ ఇయర్` వంటి చిత్రాల్లో కలిసి నటించారు.

ఆ తర్వాత మళ్లీ మరే సినిమాలో నటించలేదు. ఇంత కాలానికి `కింగ్` ద్వారా కాంబినేషన్ సాధ్యమవ్వడంతో అంచనాలు అంకంతకు రెట్టింపు అవుతున్నాయి. అభిషేక్ ఫోటో లీక్ కావడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో చర్చనీయాంశంగా మారిన పేపర్ లీక్ అంశాలను ప్రస్తావిస్తూ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. `అక్కడ నీట్ పేపర్ లీక్ అవుతుంటే? ఇక్కడ `కింగ్` సినిమా కాస్ట్ ఎక్స్‌పోజ్ అవుతోంది` అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. యూనిట్ ఎంత గోప్యంగా ఉంచాలని ప్రయత్నించినా? సెట్స్ నుండి ఇలాంటి ఫోటోలు బయటకు రావడం పట్ల చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది.

పెద్ద సినిమాల షూటింగ్ సమయంలో మొబైల్ ఫోన్లను నిషేధించినా? ఏదో విధంగా సమాచారం బయటకు వస్తూనే ఉంది. తాజా లీక్ ల నేపథ్యంలో షారుక్ ఖాన్ భద్రతను మరింత పటిష్టం చేసినట్లు సమాచారం. తాను నియ మించిన వ్యక్తుల అనుమతితోనే సెట్ లోకి ప్రవేశం ఉంటుందని...ఇతర రిఫరెన్స్ ల ద్వారా వచ్చే వారిని ఎవరినీ కూడా అనుమతించొద్దని కఠినమైన రూల్స్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవలే `కింగ్` టీమ్ దక్షిణాప్రికా షెడ్యూల్ ను ముగించుకుని భారత్ కు తిరిగొచ్చింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ముంబైలో మొదలవుతుంది. అనంతరం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో కూడా కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu