Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆదర్శ కుటుంబం.. అన్ని అప్పుడేనా మరి..

ఆదర్శ కుటుంబం.. అన్ని అప్పుడేనా మరి..

Tupaki.com 2 weeks ago

వెంకటేష్, త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తున్నారంటే కాంబినేషన్ పేరుతోనే మంచి హైప్ రావాలి. 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47'కు అనౌన్స్‌మెంట్ టైమ్‌లో అదే కనిపించింది.

కానీ రిలీజ్‌కు ఇప్పుడు నెల రోజుల సమయమే ఉన్నా, ఆ ఎదురుచూపు మాత్రం బయట పెద్దగా కనిపించడం లేదు. వెంకీని త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నాడు, ఈ కథలో అసలు పట్టుకునే పాయింట్ ఏంటి అనే దానిపై మాట్లాడుకునే స్టఫ్ ఇంకా పూర్తిగా రాలేదు.

ముందుగా టైటిల్ గ్లింప్స్ వచ్చింది. తర్వాత వెంకటేష్‌ను చిట్టిబాబుగా పరిచయం చేస్తూ మరో వీడియో వదిలారు. కుటుంబం, కొత్త ఇల్లు, సరదా మాటలతో మొదలైన ఆ వీడియో చివర్లో రక్తంతో ఉన్న రైలు షాట్స్ చూపించి కథలో మరో కోణం ఉందని హింట్ ఇచ్చారు. శ్రీనిధి శెట్టి, పిల్లల పాత్రలకు సంబంధించిన పోస్టర్లు కూడా వచ్చాయి. కానీ వీటిలో ఏదీ సినిమాను వెంటనే గుర్తుండిపోయేలా చేసే పెద్ద మూమెంట్ మాత్రం ఇవ్వలేదు.

ఇంకా పాటలు కూడా మొదలుకాలేదు. తమన్ సంగీతం కావడంతో ఒక క్యాచీ సాంగ్ పడితే ప్రమోషన్స్‌కు మంచి ఊపు రావచ్చు. వెంకీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కామెడీ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ ఎమోషన్ ఎంతవరకు ఉంటుంది, టైటిల్‌కు భిన్నంగా కనిపిస్తున్న ఆ మిస్టరీ ఏంటి అనేవి కూడా ఇంకా ఓపెన్ కాలేదు. ట్రైలర్ లేదా మరో గట్టి టీజర్‌తోనే వాటిపై ఒక ఐడియా వచ్చే ఛాన్స్ ఉంది.

పైగా రిలీజ్ డేట్ విషయంలో కూడా ఇప్పుడు అనుమానాలు వచ్చాయి. మేకర్స్ అక్టోబర్ 2 అని అధికారికంగా ప్రకటించగా, ప్రస్తుతం బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా అదే తేదీ కనిపిస్తోంది. అయితే సినిమా అక్టోబర్ 9 లేదా 16కు వెళ్లొచ్చనే రిపోర్ట్స్ బయటకు వచ్చాయి. ఇప్పటివరకు టీమ్ కొత్త తేదీ ప్రకటించలేదు. అక్టోబర్ 2నే ఫిక్స్ అయితే మాత్రం ఇక ప్రమోషన్స్‌కు ఎక్కువ రోజులు లేవు.

మరోవైపు త్రివిక్రమ్ కావాలనే సినిమాను ఎక్కువ హైప్‌లో పెట్టకుండా నెమ్మదిగా తీసుకెళ్తున్నాడా అనే ఫీలింగ్ కూడా వస్తోంది. ఫ్యామిలీ సినిమా కావడంతో రిలీజ్ దగ్గరగా వచ్చాక పాటలు, ట్రైలర్, ఇంటర్వ్యూలతో ఒకేసారి ప్రేక్షకుల్లోకి వెళ్లే ప్లాన్ ఉండొచ్చు. అలా అయితే అసలు ప్రమోషనల్ మెటీరియల్ అంతా ఇప్పుడు వరుసగా రావాల్సి ఉంటుంది.

అందుకే 'ఆదర్శ కుటుంబం' నుంచి వచ్చే నెక్స్ట్ అప్డేట్‌పై ఇప్పుడు ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఒకవైపు రిలీజ్ డేట్‌పై క్లారిటీ రావాలి. మరోవైపు సినిమా కోసం వెయిట్ చేయించే పాట లేదా ట్రైలర్ పడాలి. ఇప్పటివరకు వెంకీ, త్రివిక్రమ్ పేర్లే సినిమాను ముందుకు తీసుకొచ్చాయి. ఇక థియేటర్లకు వెళ్లేలోపు 'ఆదర్శ కుటుంబం' తన కథలో ఉన్న అసలు కిక్ ఏంటో చూపించాల్సిన టైమ్ దగ్గరపడింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu