Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆరు దశాబ్దాల తరువాత కాంగ్రెస్ కి మంత్రి యోగం

ఆరు దశాబ్దాల తరువాత కాంగ్రెస్ కి మంత్రి యోగం

Tupaki.com 4 days ago

కాంగ్రెస్ పార్టీ పుట్టె మునిగి ఆరు దశాబ్దాలు అయింది. తమిళనాడులో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత వరసగా నాలుగు ఎన్నికల్లో గెలిచి రెండు దశాబ్దాల పాటు అధికారం చలాయించిన కాంగ్రెస్ కి 1967 లో తొలి షాక్ తగిలింది.

ద్రవిడ పార్టీ డీఎంకే చేతిలో పరాభవం చెంది అధికారం వదులుకున్న కాంగ్రెస్ అది దశాబ్దాల పాటు అందని పండు అవుతుందని అసలు ఊహించలేకపోయింది. కానీ అదే జరిగింది. ఎంతో మంది ఉద్ధండులైన రాజకీయ నేతలు దిగ్గజాలు ఉన్న తమిళనాడులో కాంగ్రెస్ ఎంపీ సీట్లను ద్రవడి పార్టీలతో పొత్తులో సర్దుబాటులో తీసుకుని తన ఉనినికి చాటుకుంటోంది కానీ రాష్ట్రంలో మాత్రం మంత్రి పదవులు కనీసంగా ఒక్కటి సైతం దక్కని వాతావరణం ఉంది.

కాంగ్రెస్ జమానా అలా :

తమిళనాడులో కాంగ్రెస్ పాలన 1949లో మొదటిసారిగా మొదలైంది. స్వాతంత్ర్యం వచ్చాక ఈఎస్ కుమార్ రాజా స్వామి తమిళనాడుకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1952 దాకా మూడేళ్ళు ఆయన సీఎం గా ఉన్నారు. ఆయన తరువాత సి రాజగోపాలాచారి 1954 వరకూ రెండేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పాలించారు. ఇక తమిళనాడులో 1963 దాకా ఏకంగా తొమ్మిదేళ్ళ పాటు ఏకబిగిన పాలించిన కాంగ్రెస్ నాయకుడు కె కామరాజ్. ఈయనకు జాతీయ స్థాయిలోనూ మంచి పరిచయాలు అనుబంధం ఉన్నాయి. నాటి ప్రధానులు నెహ్రూ ఇందిరాగాంధీలకు కూడా అత్యంత సన్నిహితులుగా మెలిగారు. కాంగ్రెస్ చివరి ముఖ్యమంత్రి కె భక్తవత్సలం. ఈయన 1963 నుంచి 1967 దాకా కొనసాగారు. ఈయన హయాంలోనే డీఎంకేకి తొలిసారి అధికారం అప్పగించారు.

మళ్ళీ మంత్రి యోగం :

ఆ తరువాత కధ తెలిసిందే. 1967లో డీఎంకే నుంచి అన్నా దురై ద్రవిడ పార్టీ తరఫున తొలి సీఎం అయ్యారు. ఆయన మరణం తరువాత కరుణానిధి సీఎం అయి 8 ఏళ్ల పాటు పాలించారు. పదేళ్ళ పాటు ఎంజీఅర్ పాలిస్తేజయలిత కరుణానిధిల మధ్య రెండున్నర దశాదాల పాటు అధికారం అలా బదలాయింపు జరుగుతూ వచ్చింది. ఇక 2021లో స్టాలిన్ సీఎం అయ్యారు. 2026లో టీవీకే తరఫున తొలిసారి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు అందుకున్నారు ఇక ఆయన మంత్రివర్గంలో కాంగ్రెస్ చేరుతోంది. అలా మళ్ళీ కాంగ్రెస్ కి అధికారిక హోదా దక్కనుంది. అయిదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఉంటే అందులో ఇద్దరికి మంత్రి పదవులు లభించబోతున్నాయి. నిజంగా కాంగ్రెస్ విషయంలో ఇది గొప్ప విషయంగానే చూడాలి. మరి టీవీకే దోస్తీతో కాంగ్రెస్ తన పూర్వ రాజకీయ వైభవం అందుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu