Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అదే జరిగితే.. ఏపీ రాజకీయాల్లో బిగ్ ఛేంజ్‌... !

అదే జరిగితే.. ఏపీ రాజకీయాల్లో బిగ్ ఛేంజ్‌... !

Tupaki.com 1 week ago

చ్చే ఎన్నికల నాటికి ఏపీలో భారీ మార్పు ఉంటుందా ? పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకుంటాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా మూడు కోణాలను విశ్లేషకులు చెబుతున్నారు.

వాటి ఆధారంగా రాజకీయాల్లో పెను మార్పులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న రాజకీయాలు పూర్తిగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీనిలో ప్రధానంగా కొత్తపార్టీల ప్రభావం కూడా ఉంటుందని అంటున్నారు.

1) జగన్ పాదయాత్ర: ఆల్రెడీ సీఎంగా చేసిన నేత.. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా పాదయాత్ర చేయలేదు. ఏపీలోనూ .. ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు ఎవరూ పాదయాత్ర చేయలేదు. సీఎం చంద్రబాబు 2014లో వస్తున్నా మీకోసం పేరుతో యాత్ర చేసినా.. అది బస్సు యాత్రగానే మిగిలిపోయింది. ఇక తొలినాళ్లలో పాదయాత్ర చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా.. 2009 ఎన్నికల్లో పాదయాత్రకు దూరంగా ఉన్నారు. కానీ, తొలిసారి మాజీ ముఖ్యమంత్రి పాదయాత్ర చేయడంతో మార్పు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.

2) కుల సమీకరణలు: గత 2024 ఎన్నికలకంటే కూడా.. ఈ దఫా మరింత ఎక్కువగా కుల సమీకరణలకు అవకాశం ఉంటుందన్న అంచనాలు వస్తున్నాయి. సామాజిక వర్గాల ప్రభావం వాస్తవానికి 2014 నుంచి ఉన్నపప్పటికీ.. 2019లో కొంత ఎక్కువగా ప్రభావం చూపాయి. 2024లో రెండు సామాజిక వర్గాలు ఏక మై పోయాయి. ఇక, 2029 ఎన్నికల నాటికి కూడా కులాల రాజకీయం మరింత పెరుగుతుందని అంటున్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంలో వచ్చే మార్పులు ప్రభావం చూపిస్తాయని అంటున్నారు.

3) కొత్త పార్టీలు: వైసీపీ మాజీ నాయకుడు వి. విజయసాయి రెడ్డి సహా.. అనేక మంది కొత్తపార్టీలను ముందుకు నడిపించాలని భావిస్తున్నారు. సాయిరెడ్డి పార్టీ పూర్తిగా రెడ్లను టార్గెట్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, ఇతర పార్టీలు.. ఎస్సీ, ఎస్టీల ఓటు బ్యాంకును ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. సో.. ఇలా.. మూడు అంశాలు కూడా.. వచ్చే ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. తద్వారా ఏపీ ముఖ చిత్రం మరింతగా మారుతుందని అంచనా వేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu