Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అఖిల్ 'లెనిన్'.. అసలు సౌండ్ లేదేంటి?

అఖిల్ 'లెనిన్'.. అసలు సౌండ్ లేదేంటి?

Tupaki.com 2 days ago

క్కినేని హీరో అఖిల్ కెరీర్‌ లో ప్రస్తుతం లెనిన్ సినిమా కీలకమన్న విషయం తెలిసిందే. హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు పదేళ్లు పూర్తవుతున్నా ఇప్పటివరకు అఖిల్‌ కు కంప్లీట్ కమర్షియల్ హిట్ మాత్రం దక్కలేదు.

ప్రతి సినిమాతో కొత్త ప్రయత్నం చేస్తున్నా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఈసారి మాత్రం మాస్ ఆడియన్స్‌ ను టార్గెట్ చేస్తూ లెనిన్ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు.

ఏజెంట్ తర్వాత అఖిల్ గ్యాప్ తీసుకోవడం కూడా లెనిన్ మూవీపై ఆసక్తి పెంచింది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఆ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ గా రూపొందుతోంది. ఇందులో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌ గా యాక్ట్ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి. నిర్మాతలుగా నాగార్జున, నాగవంశీ వ్యవహరిస్తుండగా, తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

సినిమా కోసం అఖిల్ తన లుక్‌ ను కంప్లీట్ గా మార్చుకున్నట్లు కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తోంది. మాస్ బాడీ లాంగ్వేజ్‌ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్‌ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే అభిమానులు కూడా సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా మాస్ ఇమేజ్ కోసం అఖిల్ చేస్తున్న ప్రయత్నం ఎలా ఉండబోతుందన్న ఆసక్తి నెలకొంది.

మొదట సినిమాను మే 1న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే అదే సమయంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది విడుదల తేదీ ఏప్రిల్ 30గా ప్రకటించడంతో పోటీని తప్పించుకునేందుకు లెనిన్ విడుదలను వాయిదా వేశారు. తర్వాత పెద్ది కూడా జూన్ 4కు మారడంతో లెనిన్ ను జూన్ 26న విడుదల చేయాలని ఫిక్స్ చేశారు.

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న మాత్రం ఒక్కటే. అసలు లెనిన్ సౌండ్ ఎక్కడ? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రిలీజ్‌ కు పెద్దగా సమయం లేకపోయినా ఇప్పటివరకు సరైన ప్రమోషన్స్ కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సినిమాలకు విడుదలకు రెండు మూడు నెలల ముందే గ్లింప్స్, టీజర్లు, పాటలు, పోస్టర్లతో హైప్ పెంచే ప్రయత్నం జరుగుతుంది.

కానీ లెనిన్ విషయంలో మాత్రం ఇంకా ఆ స్థాయి సందడి కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం షూటింగ్ ఇంకా కొనసాగుతుండటమేనని సమాచారం. కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలతో పాటు పాటల చిత్రీకరణ పెండింగ్‌ లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రమోషన్స్‌ ను మేకర్స్ ఆలస్యం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కానీ ఇదే పరిస్థితి కొనసాగితే సినిమాపై ఉన్న ప్రారంభ హైప్ తగ్గిపోయే ప్రమాదం ఉందని చెప్పాలి.

మరోవైపు అఖిల్ అభిమానులు మాత్రం త్వరగా అప్డేట్స్ ఇవ్వాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. కనీసం టీజర్ లేదా గ్లింప్స్ విడుదల చేస్తే సినిమాపై మళ్లీ బజ్ పెరుగుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం పోటీ కూడా గట్టిగానే ఉంది. పెద్ద సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో లెనిన్ తన ప్రత్యేకతను చూపించాల్సిన అవసరం ఉంది. మరి మేకర్స్ త్వరలో ప్రమోషన్స్ మొదలుపెట్టి సినిమాపై హైప్‌ ను మళ్లీ పెంచుతారా? అఖిల్‌ కు సినిమా నిజంగా మాస్ బ్రేక్ ఇస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu