Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అంబటి.. 'యాత్ర' .. వాస్తవం ఏంటి?

అంబటి.. 'యాత్ర' .. వాస్తవం ఏంటి?

Tupaki.com 2 weeks ago

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. కీలక ప్రకటన చేశారు. త్వరలోనే చేపట్టనున్న తన 'విజ్ఞాపన యాత్ర'ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

దీనికి ఆయన పలు కారణాలు చెప్పు కొచ్చారు. జగన్ నుంచి అనుమతి ఇంకా రాలేదని చూచాయగా చెప్పారు. ఇదే సమయంలో పార్టీ తరఫున డీఎస్సీ విద్యార్థుల కోసం.. వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే యాత్రను వాయిదా వేస్తున్నామన్నారు.

ఇంత కీ యాత్ర దేనికి?

ఇక, అంబటి రాంబాబు చేపట్టాలని అనుకున్న యాత్ర.. మంత్రి నారా లోకేష్ రాజీనామా కోసమే!. ఆశ్చర్యం ఏమీ లేదు. డీఎస్సీలో జరిగిన అవకతవకలను ప్రశ్నిస్తున్నట్టు చెబుతున్న అంబటి.. దీనికి బాధ్యత వహిస్తూ.. లోకేష్ రాజీనామా చేయాలన్నది అంబటి డిమాండ్. ఈ క్రమంలోనే 'విజ్ఞాపన యాత్ర' పేరుతో తన సొంత నియోజకవర్గం సత్తెనపల్లి నుంచి మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం వరకు ఈ యాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. అయితే.. అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్టు ప్రకటిం చారు.

వాస్తవం ఏంటి?

అయితే.. అంబటి కానీ.. వైసీపీ నాయకులు కానీ చేస్తున్న ఆరోపణలను వాస్తవాలను గమనిస్తే.. డీఎస్సీలో అవకతవకలు జరిగాయన్నది నిజమా? అనేది ప్రశ్న. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం సహా.. ఉన్నతాధికారు లు కూడా వివరణ ఇచ్చారు. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత.. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల కు సంబంధించిన డీఎస్సీ పరీక్ష నిర్వహించారు. కానీ, ఈ క్రమంలో అమలు చేసిన రిజర్వేషన్ పై కొన్ని సందేహాలు.. అదేసమయంలో అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.

దీని పై కూడా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ సారి హారిజాంటల్ రిజర్వేషన్‌ను అమలు చేశామని చెప్పు కొచ్చారు. దీనిని అర్ధం చేసుకోవడం కొంత మేరకు కష్టమని.. కానీ, దీనిని అన్ని ప్రవేశ పరీక్షల్లోనూ అమ లు చేస్తున్నారని అధికారులు వివరించారు. దీనినే డీఎస్సీలో అమలు చేశామన్నారు. ఫలితంగా దీనిని అర్ధం చేసుకోవడంలో విఫలమైన కొందరు అభ్యర్థులు ఆందోళనకు దిగారని తెలిపారు. ఇక, డీఎస్సీ పై ఇప్పటికే హైకోర్టులో దాఖలైన పిటిషన్లను కోర్టు కూడా కొట్టివేసింది. కానీ, వైసీపీ నేతలు మాత్రం దీనిపై ఆరోపణలు చేస్తున్నారన్నది ప్రభుత్వం వాదన.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu