Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అందుకే ఆ విషయం మీద మాట్లాడటం లేదు: అనసూయ

అందుకే ఆ విషయం మీద మాట్లాడటం లేదు: అనసూయ

Tupaki.com 1 week ago

​సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పే అనసూయ భరద్వాజ్ తాజాగా చేసిన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్‌లు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని సున్నితమైన అంశాల మీద ఆమె స్పందించిన తీరు చర్చకు దారితీసింది. సాధారణంగా ఏ చిన్న విషయం జరిగినా అనసూయ స్పందన ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ఈసారి ఆమె చాలా బ్యాలెన్స్‌డ్‌గ తన వివరణ ఇచ్చారు.

​ప్రజా సమస్యల మీద తనను స్పందించమని కోరడం ఒక రకంగా తనకు దక్కిన గౌరవమని, అదే సమయంలో అది ఒక భారమని అనసూయ పేర్కొన్నారు. ప్రపంచంలో జరిగే ప్రతి విషయం మీద తనకు పూర్తి అవగాహన ఉండకపోవచ్చని, అందుకే అవగాహన లేకుండా ఏ విషయం మీద మాట్లాడటం సరైంది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో ఏదైనా విషయం ట్రెండింగ్‌లో ఉంది కదా అని ఉత్సాహంతో దాని మీద దూకడం తన నైజం కాదని, ఒక మనిషిగా, వర్కింగ్ పేరెంట్‌గా తనకు కొన్ని పరిమితులు ఉంటాయని ఆమె చాలా స్పష్టంగా వివరించారు.

​ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన ఇష్యూ మీద వస్తున్న వార్తలన్నీ తానూ గమనిస్తున్నానని, కానీ మీడియాలో వచ్చే అప్‌డేట్స్ మాత్రమే చూసి ఒక నిర్ధారణకు రావడం కరెక్ట్ కాదని ఆమె చెప్పారు. పూర్తి నిజాలు బయటకు రాకుండా తొందరపడి ఒక స్పందించడం వల్ల ప్రయోజనం లేదని అన్నారు. ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడే ముందు దానికి సంబంధించిన పూర్తి వాస్తవాలను తెలుసుకోవాలని, అప్పుడే ఆ మాటకు విలువ ఉంటుందని అనసూయ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

​ఇక ఆరోపణల గురించి స్పందిస్తూ.. ఒకవేళ ఎవరి మీదైనా వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపణ అయితే, చట్టప్రకారం కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. అయితే, ఒకవేళ పరిస్థితులు భిన్నంగా ఉంటే, కేవలం ముందస్తు తీర్పుల వల్ల జరిగే నష్టం గురించి కూడా ఆలోచించాలని ఆమె కోరారు. నిజానిజాలు తెలియకుండా ఒక వ్యక్తిని లేదా వ్యవస్థను దోషిగా నిలబెట్టడం వల్ల కలిగే డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

​సోషల్ మీడియాలో ఏదైనా విషయం మీద తక్షణమే స్పందించడం చాలా సులభమని, కానీ బాధ్యతాయుతంగా వ్యవహరించడం, వ్యవస్థను గౌరవించడం చాలా ముఖ్యమని అనసూయ హితవు పలికారు. అధికారికంగా వాస్తవాలు వెల్లడయ్యే వరకు మనం కొంచెం ఓపికగా, బ్యాలెన్స్‌డ్‌గా ఉండటం మంచిదని ఆమె సూచించారు. ఏదైనా ఒక విషయాన్ని కేవలం ఒకే కోణంలో చూడకుండా, అన్ని విధాలుగా ఆలోచించాలని తెలిపారు.

​అనసూయ చేసిన ఈ పోస్ట్‌లు నెటిజన్లను ఆలోచింపజేస్తున్నాయి. ఎప్పుడూ ఆవేశంగా స్పందిస్తుందని పేరున్న ఆమె, ఈసారి చాలా హుందాగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. వాస్తవాలు తెలిశాకే తన వివరణను వినిపిస్తానని ఆమె ఇచ్చిన క్లారిటీతో, ఇకనైనా అనవసరమైన ఊహాగానాలకు చెక్ పడుతుందేమో చూడాలి. సత్యమేవ జయతే అంటూ ఆమె ఈ పోస్ట్ ను ముగించారు. ఇక రానున్న రోజుల్లో ఆమె ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu