Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అనుపమ క్రేజీ కళ్యాణం.. సర్ ప్రైజ్ రెడీ

అనుపమ క్రేజీ కళ్యాణం.. సర్ ప్రైజ్ రెడీ

Tupaki.com 3 weeks ago

పెళ్లి నేపధ్యంలో వచ్చే సినిమాలకు మన ఆడియన్స్ లో ఎప్పుడూ ఒక క్రేజ్ ఉంటుంది. సీరియస్ యాక్షన్ స్టోరీల కంటే ఇలాంటి ఫన్ కంటెంట్ మూవీస్ కు మంచి రీచ్ వస్తోంది.

ఇదే ఫార్ములాతో ఇప్పుడు రాబోతున్న కొత్త సినిమా క్రేజీ కళ్యాణం. నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజు వెడ్స్ రంభాయ్ ఫేమ్ అఖిల్ ఇందులో మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు. ఈ కాస్టింగ్ చూస్తుంటేనే ఇది ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్ లా అనిపిస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ రీసెంట్ గా వదిలిన పోస్టర్స్ తో సోషల్ మీడియాలో డీసెంట్ బజ్ క్రియేట్ అయింది. కాస్ట్ అంతా కలిసి ఉన్న ఒక కలర్ ఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేసి టీజర్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఆగస్టు 1వ తేదీన ఈ మూవీ అఫీషియల్ టీజర్ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. పెళ్లి ఇంట్లో ఉండే సందడి, అందులో జరిగే కన్ఫ్యూజన్ అంతా ఈ వీడియోలో చూపించబోతున్నట్లు టీమ్ హింట్ ఇస్తోంది.

తెలంగాణ రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. పల్లెటూరి పెళ్లి వాతావరణాన్ని చాలా నాచురల్ గా ఇందులో చూపించబోతున్నారు. భద్రప్ప గాజుల ఈ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన రాసుకున్న స్టోరీ లైన్ మొత్తం ఒక పెళ్లి చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. విలేజ్ నేటివిటీకి తగ్గట్లుగా ఉండే ఫన్ ఎలిమెంట్స్ తో పాటు కాస్త ఎమోషన్ కూడా ఈ కథలో ఉండబోతోందని ఇండస్ట్రీ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

ఇక మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ రోల్ కాస్త స్పెషల్ గా ఉండబోతోంది. కీర్తి అనే క్యారెక్టర్ లో ఒక అల్లరి పెళ్లికూతురిగా ఆమె కనిపించనుంది. లాస్ట్ పోస్టర్ లో ఆమె క్యూట్ స్మైల్ తో బ్రైడల్ లుక్ లో బాగా సెట్ అయింది. రీసెంట్ గా కాస్త డిఫరెంట్ రోల్స్ ట్రై చేస్తున్న అనుపమ మళ్లీ ఇలాంటి విలేజ్ బేస్డ్ ఫన్ క్యారెక్టర్ చేయడం ఆమె ఫ్యాన్స్ కి కూడా ఒక కొత్త ఫీలింగ్ ఇస్తుంది.

ఇక ఈ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ డీటెయిల్స్ చూసుకుంటే ఆరో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 2గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బూసం జగన్ మోహన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రూరల్ సబ్జెక్ట్స్ కి మంచి మ్యూజిక్ ఇచ్చే సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ పెళ్లి గోలకి బాగా ప్లస్ అవుతుందని మూవీ టీమ్ గట్టిగా నమ్ముతోంది.

ఓవరాల్ గా చూసుకుంటే పెద్దగా హడావుడి లేకుండా ఒక సింపుల్ ఫన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. డైరెక్టర్ ఎంచుకున్న కాస్టింగ్ కూడా ఈ కథకు బాగా సెట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇక రిలీజ్ అయ్యే టీజర్ చూస్తే ఈ ప్రాజెక్ట్ అసలు రేంజ్ ఏంటి అనేది ఆడియన్స్ కి ఒక క్లారిటీ వస్తుంది. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే రిలీజ్ డేట్ తో పాటు మరిన్ని అప్డేట్స్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu