Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాబా ఎప్పటికీ బాబానే.. భాయ్ ఎందుకింత ఎమోషనల్? ఇండస్ట్రీ టాప్-5 బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే!

బాబా ఎప్పటికీ బాబానే.. భాయ్ ఎందుకింత ఎమోషనల్? ఇండస్ట్రీ టాప్-5 బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే!

Tupaki.com 1 week ago

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తన ఆప్తమిత్రుడు, నటుడు సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతోంది.

సంజయ్ దత్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ''బాబా ఎప్పటికీ బాబానే! సంజు బాబా మనందరి బాబా.. నా పెద్ద అన్నయ్య సంజయ్ దత్! అల్లా- భగవంతుడు- జీసస్ అందరూ ఈ మనిషిని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచాలి.. ఐ లవ్ యూ బాబా!'' అంటూ సల్మాన్ తనదైన శైలిలో రాసిన క్యాప్షన్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఈ పోస్ట్‌కు సంజయ్ దత్ కూడా స్పందిస్తూ ''బ్రదర్స్ ఫర్ లైఫ్.. లవ్ యూ భాయ్‌జాన్!'' అని కామెంట్ చేయడంతో ఈ ఇద్దరు దిగ్గజాల స్నేహబంధం మరోసారి వార్తల్లో నిలిచింది.

సంజయ్ దత్ సల్మాన్ ఖాన్‌ల మధ్య ఉన్న ఈ అనుబంధం కేవలం ఒక పోస్ట్‌కో లేదా పుట్టినరోజు వేడుకకో పరిమితమైంది కాదు. గత 30 ఏళ్లకు పైగా సాజన్, చల్ మేరే భాయ్ వంటి సినిమాలతో వెండితెరపై అలరించిన ఈ జోడీ నిజ జీవితంలోనూ ఎన్నో ఒడుదుడుకుల్లో ఒకరికొకరు అండగా నిలిచారు. అందుకే సల్మాన్ ఇంత ఎమోషనల్‌గా ``బాబా ఎప్పటికీ బాబానే`` అంటూ తన అన్నయ్యపై ఉన్న ప్రేమను, గౌరవాన్ని చాటుకున్నారు. వీరిద్దరి బంధాన్ని చూసి అభిమానులు ``బాలీవుడ్‌లో అసలైన భాయి భాయీ రిలేషన్ అంటే వీరిదే`` అని సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేస్తున్నారు.

సంజయ్ దత్ (సంజూ బాబా) సినీ పరిశ్రమలో ఎందరితోనో ఎంతో ఆత్మీయంగా ఉంటారు. అయితే ఆయన జీవితంలో ఎదురైన ఎన్నో ఎత్తుపల్లాల్లో ఆయనతో అత్యంత సన్నిహితంగా నిలబడిన టాప్-5 స్టార్ సెలబ్రిటీలలో మొదటి స్థానం సల్మాన్ ఖాన్‌దే. వీరిద్దరూ ఒకరినొకరు కష్టసుఖాల్లో సొంత సోదరుల కంటే ఎక్కువగా భావించుకుంటారు. 'సాజన్' చిత్రం నుంచి మొదలైన వీరి ప్రయాణం నేటికీ అంతే బలమైన ఆత్మీయతతో కొనసాగుతోంది.

ఇక సంజూ బాబాతో అత్యంత సన్నిహితంగా ఉండే మిగిలిన నటుల్లో అజయ్ దేవగన్, సునీల్ శెట్టి, అనిల్ కపూర్ .. దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీలు ఉన్నారు. `ఆల్ ది బెస్ట్`, `సన్ ఆఫ్ సర్దార్` చిత్రాల్లో నటించిన అజయ్ దేవగన్ సంజయ్ కి మంచి మిత్రుడిగా తోడుగా నిలిచారు. అలాగే సంజయ్ కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడిన నిజమైన మిత్రుల్లో సునీల్ శెట్టి ఒకరు కాగా... ఎనభైల కాలం నుండి అనిల్ కపూర్ ఆయనతో సుదీర్ఘమైన స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపు `మున్నాభాయ్` సిరీస్, `సంజూ` బయోపిక్ ద్వారా రాజ్ కుమార్ హిరాణీతో కూడా సంజయ్ దత్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది.

ఏది ఏమైనా ఎంతటి బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ.. తన `బడా భాయ్` సంజయ్ దత్ పుట్టినరోజును పురస్కరించుకుని సల్మాన్ ఖాన్ వేసిన ఈ పోస్ట్ బాలీవుడ్ స్వర్ణయుగానికి.... నిజమైన స్నేహానికి ప్రతీకగా నిలిచింది. కోట్లాదిమంది ప్రజలు సహా పలువురు ప్రముఖులు ప్రశంసించిన ఈ ఐకానిక్ కాంబినేషన్ మళ్లీ వెండితెరపై కలిసి కనిపించాలని.. ప్రేక్షకులను అలరించాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu