Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాక్సాఫీస్ ప్రకారం తమిళ ఇండస్ట్రీలో అసలైన సూపర్‌స్టార్ ఎవరు..?

బాక్సాఫీస్ ప్రకారం తమిళ ఇండస్ట్రీలో అసలైన సూపర్‌స్టార్ ఎవరు..?

Tupaki.com 3 days ago

మిళ సినీ పరిశ్రమ అంటే కేవలం సినిమాలకే పరిమితం కాదు, అక్కడ స్టార్‌డమ్ ఒక సంస్కృతి లాంటిది. హీరోలపై అభిమానులు చూపించే ఆరాధన, థియేటర్ల వద్ద కనిపించే హంగామా, బాక్సాఫీస్ వద్ద నమోదయ్యే రికార్డులు కోలీవుడ్‌ను ప్రత్యేకంగా నిలబెడతాయి.

ఇప్పుడు సోషల్ మీడియాలో బాక్సాఫీస్ స్టాటిస్టిక్స్ ప్రకారం కోలీవుడ్‌లో అతిపెద్ద సూపర్‌స్టార్లు ఎవరు? అనే చర్చ మరోసారి వైరల్ అవుతోంది.

ఇందులో రజనీకాంత్ మొదటి స్థానంలో నిలవగా, తర్వాతి స్థానాల్లో విజయ్, అజిత్, సూర్య, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలు చోటు దక్కించుకోవడం అభిమానుల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ముఖ్యంగా థియేట్రికల్ మార్కెట్, ఓపెనింగ్స్, ఓవర్సీస్ కలెక్షన్స్, ఫ్యాన్ బేస్, వరుస హిట్స్ వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఈ ర్యాంకింగ్ రూపొందినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ లిస్ట్ లో సూపర్‌స్టార్ రజనీకాంత్ అగ్రస్థానంలో ఉండటం ఆశ్చర్యం కాదు. దశాబ్దాలుగా ఆయనకున్న క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. జైలర్ వంటి సినిమాలతో రజనీ ఇంకా బాక్సాఫీస్ వద్ద తన మార్క్ చూపించగలరని నిరూపించారు. రెండో స్థానంలో ఉన్న తలపతి విజయ్ ప్రస్తుతం తమిళనాడులో అత్యంత భారీ మార్కెట్ కలిగిన హీరోగా ఎదిగారు. లియో, గోట్ లాంటి సినిమాల ద్వారా భారీ ఓపెనింగ్స్ సాధిస్తూ యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించారు.

మూడో స్థానంలో ఉన్న అజిత్‌కు మాస్ సెంటర్లలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్నప్పటికీ ఆయన సినిమాలకు వచ్చే ఓపెనింగ్స్ ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇక సూర్య, కమల్ హాసన్ వంటి నటులు కేవలం స్టార్‌డమ్ మాత్రమే కాదు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా బలమైన మార్కెట్‌ను నిలబెట్టుకున్నారు. విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్, విజయ్ సేతుపతి, కార్తీ లాంటి నటులు తమదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కోలీవుడ్ స్టార్ రేసును మరింత ఆసక్తికరంగా మార్చుతున్నారు.

అయితే ఈ ర్యాంకింగ్స్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అభిమానులు బాక్సాఫీస్ లెక్కల ప్రకారం చూస్తే విజయ్ రెండో స్థానంలో కాదు, మొదటి స్థానంలో ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు కమల్ హాసన్ స్థానం ఇంకా ముందు ప్లేస్ లో ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఇటీవల గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన ధనుష్, విక్రమ్‌లకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిందని కూడా చర్చ సాగుతోంది. నిజానికి కోలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను కేవలం కలెక్షన్స్‌తో కొలవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రతి హీరోకు వేర్వేరు తరహా అభిమాన వర్గం ఉంది. రజనీకి ఉన్న కల్ట్ ఇమేజ్, విజయ్‌కు ఉన్న యూత్ ఫాలోయింగ్, అజిత్‌కు ఉన్న మాస్ క్రేజ్, కమల్ హాసన్‌కు ఉన్న లెజెండరీ స్టేటస్ ఒక్కొక్కటి ఒక్కో విధంగా స్పెషల్. అయితే కోలీవుడ్ ప్రస్తుతం ఇండియన్ సినిమా మార్కెట్‌లో అత్యంత బలమైన స్టార్ సిస్టమ్ కలిగిన పరిశ్రమగా నిలుస్తోంది. ఇక ఈ టాప్ 10 జాబితా సోషల్ మీడియాలో మరికొన్ని రోజులు అభిమానుల మధ్య హీట్ పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu