Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాలీవుడ్ ముందు బుచ్చిబాబు తెలుగులోనే..

బాలీవుడ్ ముందు బుచ్చిబాబు తెలుగులోనే..

Tupaki.com 1 week ago

ప్పెన సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సనా.. ఇప్పుడు పెద్ది సినిమాతో మరోసారి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఆ పాన్ ఇండియా చిత్రంపై ఇప్పటికే ఆడియన్స్ తోపాటు అభిమానుల్లో మంచి హైప్ నెలకొంది. రూరల్ బ్యాక్‌ డ్రాప్‌ లో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమా జూన్ 4న విడుదల కానుంది.

సినిమా ప్రమోషన్స్‌ లో భాగంగా తాజాగా ముంబైలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ సను గ్రాండ్‌గా నిర్వహించారు. బాలీవుడ్ మీడియా, నార్త్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించేలా ఆ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. ఆ ఈవెంట్‌ కు హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సహా చిత్ర బృందం హాజరైంది. అయితే ఆ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం బుచ్చిబాబు మాట్లాడిన తీరు.

తనకు హిందీ రాదని స్పష్టంగా చెప్పిన ఆయన.. ముంబై వేదికపైనే తెలుగులో మాట్లాడటం విశేషం. ముంబై వచ్చినట్లు లేదు.. ఆంధ్రాలో ఫంక్షన్ జరిగినట్లు ఉందంటూ ప్రారంభించిన ఆయన చేసిన కామెంట్స్ అక్కడి తెలుగు అభిమానులను ఆకట్టుకున్నాయి. భాష కంటే భావమే ముఖ్యమనేలా ఆయన మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది.

ఇక పెద్దిలో రామ్ చరణ్ చేసిన కష్టంపై బుచ్చిబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ పాత్ర కోసం చరణ్ పూర్తిగా తనను తాను మార్చుకున్నారని తెలిపారు. మూడు నాలుగు నెలల్లోనే ట్రాన్స్‌ ఫర్మేషన్ అయ్యారని చెప్పారు. సినిమాలో భాగంాగా ఒక దశలో క్రికెటర్‌ లా కనిపించారని, తర్వాత రెజ్లర్‌ గా మారారని చెప్పారు. మరో గేమ్ ప్లేయర్‌ గా కూడా కొత్తగా కనిపించారంటూ చెప్పారు. పాత్ర కోసం చరణ్ ఎంత కష్టపడ్డారో తాను దగ్గరుండి చూసినట్లు బుచ్చిబాబు వెల్లడించారు.

షూటింగ్ సమయంలో అయ్యప్ప మాల వేసుకోవడం వల్ల పూర్తిగా వెజ్ ఫుడ్ తీసుకున్నారని తెలిపారు. "చరణ్ సర్ చాలా కష్టపడ్డారు. ఆ క్యారెక్టర్‌ కు ఆయనలోని మాస్ అప్పియరెన్స్ సరిపోయింది. నిజానికి పెద్దికి చరణ్ మాత్రమే సరిపోతారు" అంటూ ప్రశంసించారు. అయితే బుచ్చిబాబు మాటల్లో కనిపించిన ఆత్మీయత.. హీరోపై ఉన్న గౌరవం అభిమానులను ఆకట్టుకుంటోంది. దర్శకుడిగా తన హీరోపై పూర్తి నమ్మకం పెట్టుకున్నట్టు స్పష్టంగా కనిపించింది.

అసిస్టెంట్ డైరెక్టర్‌ గా కెరీర్ ప్రారంభించిన బుచ్చిబాబు.. ఇప్పుడు స్టార్ హీరోతో మూవీ తీసిన డైరెక్టర్ స్థాయికి చేరుకోవడం ఆసక్తికరమే. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆయన.. ప్రముఖ దర్శకుడు సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌ గా పనిచేశారు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం వంటి చిత్రాలకు ఆయన వర్క్ చేశారు. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా వచ్చిన ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు.

2021లో విడుదలైన ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా తెచ్చిపెట్టింది. తొలి సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు.. ఇప్పుడు పెద్దితో మరోసారి తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో చేస్తున్న ఆ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆయన కెరీర్‌ లో కీలకంగా మారనుంది. మరి ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu