Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బంగారం గొలుసు గిప్ట్ గా ఇచ్చిన సీనియర్ బ్యూటీ!

బంగారం గొలుసు గిప్ట్ గా ఇచ్చిన సీనియర్ బ్యూటీ!

Tupaki.com 5 days ago

సీనియర్ బ్యూటీ టబు జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. నాలుగు పదుల వయసులోనూ టబు బోల్డ్ అండ్ రొమాంటిక్ చిత్రాల్లో ఎలాంటి పెర్పార్మెన్స్ ఇస్తుందో తెలిసిందే.

ఓవైపు సాప్ట్ పాత్రల్లో కనిపిస్తున్నా? రొమాంటిక్ రోల్స్ వచ్చినా? నో చెప్పకుండా పని చేస్తోంది. తాజాగా అమ్మడు నటించిన `తక్షక్` సినిమా పాత సంఘటన నెట్టింట వైరల్ అవుతోంది. ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ హిట్ `తక్షక్` చిత్రంలోని ఐకానిక్ సాంగ్ రంగ్ దే షూటింగ్ సంబంధించిన ఓ ఆసక్తికరమైన -హృదయాన్ని హత్తుకునే గతాన్ని ఇండస్ట్రీ వర్గాలు గుర్తు చేసుకున్నాయి. ఈ పాట చిత్రీకరణ ముగిసిన తర్వాత టబు చూపించిన ఉదారత నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

`రంగ్ దే` పాట టబు కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ డ్యాన్స్ నంబర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ పాటకు లెజెండరీ కొరియోగ్రాఫర్ మాస్టర్ సరోజ్ ఖాన్ కొరియోగ్రఫీ అందించారు. ఎంతో క్లిష్టమైన క్లాసికల్ -ఫోక్ స్టెప్స్‌తో కూడిన ఈ పాటను టబు ఎంతో అద్భుతంగా పండించారు. షూటింగ్ పూర్తయిన తర్వాత అవుట్‌పుట్ చూసి ఎంతో సంతృప్తి చెందిన టబు ఈ పాట అంత బాగా రావడానికి రేయింబవళ్లు కష్టపడిన మాస్టర్ సరోజ్ ఖాన్‌కు కృతజ్ఞతగా ఖరీదైన బంగారు గొలుసును కానుకగా అందించి సర్ప్రైజ్ చేశారు. కొరియోగ్రాఫర్‌ను మాత్రమే కాకుండా ఆ పాట వెనుక ఉండి కష్టపడిన ప్రతీ ఒక్కరినీ టబు సమానంగా గౌరవించారు.

సరోజ్ ఖాన్ అసిస్టెంట్లతో పాటు గ్రూప్ డ్యాన్స్‌లో పాల్గొన్న దాదాపు 30 మంది డ్యాన్సర్లలో ప్రతి ఒక్కరికీ ఆ రోజుల్లోనే వెయ్యి రూపాయల చొప్పున నగదు బహుమతిని ఇచ్చి ప్రోత్సహించారుట. సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్ల కష్టాన్ని చాలామంది గుర్తించరు. కానీ టబు వారి శ్రమను గుర్తించి స్వయంగా బహుమతులు అందించడం ఆ సమయంలో షూటింగ్ సెట్స్‌లో ఉన్నవారందరినీ ఎంతో ఆకట్టుకుంది. ఆ రోజుల్లో టబు చేసిన మంచి పని గురించి సదరు డ్యాన్సర్లు - ఇండస్ట్రీ పెద్దలు ఇప్పటికీ ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు.

షూటింగ్ సమయంలో టబు ఎంతో ఓపికగా డాన్స్ స్టెప్స్ నేర్చుకోవడమే కాకుండా, సెట్స్‌లో ఉన్న జూనియర్ ఆర్టిస్టులతో మరియు డ్యాన్సర్లతో ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారని వారు గుర్తుచేసుకున్నారు. ఒక అగ్ర నటి అయ్యుండి కూడా ఎలాంటి ఈగో లేకుండా అందరినీ కలుపుకుపోయే నైజమే ఆమెను ఇండస్ట్రీలో దశాబ్దాలుగా స్టార్‌గా నిలబెట్టిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. `రంగ్ దే` పాట ఇప్పటికీ యూట్యూబ్‌లో - మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్స్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో క్లాసిక్ హిట్‌గా కొనసాగుతోంది.

ఏఆర్ రెహమాన్ అందించిన మంత్రముగ్ధమైన సంగీతానికి సరోజ్ ఖాన్ కంపోజ్ చేసిన క్లాసికల్ మూమెంట్స్ , టబు అద్భుతమైన హావభావాలు తోడవ్వడంతో సాంగ్ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ పాత జ్ఞాపకం, టబుకు తోటి శ్రామికుల పట్ల ఉన్న గౌరవాన్ని , మానవత్వాన్ని మరోసారి చాటిచెప్పింది. సినిమాల్లో సక్సెస్ సాధించడం ఎంత ముఖ్యమో? ఆ సక్సెస్ వెనుక ఉన్న కష్టాన్ని గుర్తించడం కూడా అంతే ముఖ్యం అని టబు నిరూపించారు. నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్‌కు గోల్డ్ చైన్, డ్యాన్సర్లకు నగదు బహుమతులు అందించిన ఆమె ఉదారత నేటి తరం స్టార్ హీరో హీరోయిన్లకు కూడా ఒక మంచి గైడ్‌లైన్ లాంటిది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu